North Korea Missile: 


బాలిస్టిక్ మిజైల్ లాంఛ్..


ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్ ఉన్ మరోసారి పొరుగు దేశాలను టెన్షన్ పెడుతున్నారు. ఉన్నట్టుండి ఓ బాలిస్టిక్ మిజైల్‌ని లాంఛ్ చేసినట్టు జపాన్‌తో పాటు దక్షిణ కొరియా వెల్లడించింది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిద వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య వైరం పెరుగుతూ వస్తోంది. తరచూ క్షిపణులను ప్రయోగిస్తూ దక్షిణ కొరియాను కవ్విస్తున్నారు కిమ్‌. యుద్ధానికి రెడీగా ఉండండి అంటూ సైనికులకు పిలుపు కూడా ఇచ్చారు. ఇలాంటి తరుణంలో మరోసారి బాలిస్టిక్ మిజైల్‌ని లాంఛ్ చేయడంపై దక్షిణ కొరియా అసహనం వ్యక్తం చేస్తోంది. అటు జపాన్ కూడా టెన్షన్ పడుతోంది. ఈ క్షిపణికి సంబంధించిన సమాచారాన్ని వీలైనంత త్వరగా అందించాలని అధికారులకు ఆర్డర్‌ వేశారు కిషిద. జపాన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవాలని తేల్చి చెప్పారు. అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. ఈ మధ్యే అమెరికా, దక్షిణ కొరియా కలిసి పెద్ద ఎత్తున ఫైర్ డ్రిల్స్ చేపట్టాయి. అప్పటి నుంచి ఉత్తర కొరియా ఇలా కవ్విస్తోంది. గత నెల ఓ స్పై మిజైల్‌ని పంపేందుకూ ప్రయత్నం చేసి విఫలమైంది. అప్పటి నుంచి మరింత అసహనంగా ఉన్నారు కిమ్. ఎలాగైనా అమెరికాని, దక్షిణ కొరియాను భయపెట్టాలని చూస్తున్నారు. 


యుద్ధమేనా..? 


ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్ ఉన్ మార్చి నెలలో మిలిటరీకి సంచలన ఆదేశాలు ఇచ్చారు. యుద్ధానికి సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. మిలిటరీ డ్రిల్స్ చేస్తున్న సమయంలో...ఇక నిజమైన వార్‌కు రెడీ అవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. తన కూతురితో పాటు ఈ డ్రిల్స్‌ను పరిశీలించిన కిమ్‌...వెంటనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఉత్తర కొరియా నుంచి ఓ బాలిస్టిక్ మిజైల్‌ లాంఛ్ అయినట్టు గుర్తించామని దక్షిణ కొరియా వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్నామని తెలిపింది. మరి కొన్ని మిజైల్స్‌నీ లాంఛ్ చేసే ప్రమాదముందని అంచనా వేస్తోంది. కూతురితో పాటు మిలిటరీ డ్రిల్స్ చూస్తున్న కిమ్ జాంగ్‌ ఫోటోలను విడుదల చేసింది Korean Central News Agency (KCNA). హ్వాసంగ్ యూనిట్ నుంచి ఒకేసారి ఆరు మిజైల్స్‌ను లాంఛ్ చేసినట్టు తెలిపింది. దాడులు చేసేందుకు వినియోగించే క్షిపణులను టెస్ట్ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.


కొరియాలోని పశ్చిమ సముద్రాన్ని టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశాలున్నట్టు సమాచారం. కొన్ని దశాబ్దాలుగా ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య దూరం, వైరం పెరుగుతూ వస్తున్నాయి. అయితే మరి కొందరు మాత్రం ఇదంతా కవ్వింపు చర్యలేనని, దక్షిణ కొరియాను అలెర్ట్ చేసేందుకు కిమ్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు. దక్షిణ కొరియాను ఇంకా టెన్షన్ పెడుతోంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది. ఫోన్ కాల్ ద్వారా సంప్రదించాలని చూస్తోంది. ఇటు నార్త్ కొరియా మాత్రం అక్కడి నుంచి ఏ కాల్‌ను కూడా రిసీవ్ చేసుకోవడం లేదు. మిలిటరీ కాన్‌ఫ్లిక్ట్‌పై చర్చించేందుకు ఎన్ని సార్లు డయల్ చేసినా ఒక్కసారి కూడా ఆన్సర్ చేయడం లేదని దక్షిణ కొరియా అధికారికంగా ప్రకటించింది. ఈ కారణంగా...ఆందోళనలు మరింత పెరిగాయి. కావాలనే ఉత్తర కొరియా ఇలా చేస్తోందా..? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. 


Also Read: Millionaires Migration: ఇండియా నుంచి వేరే దేశాలకు వలస వెళ్తున్న మిలియనీర్లు, కారణమదేనట