Los Angeles Protest :  అమెరికాలో ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ నుంచి అనేక రాష్ట్రాల వరకు హింసాత్మక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రజాగ్రహం రోడ్డు ఎక్కింది.  వారు కార్లకు నిప్పు పెట్టారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. లాస్ ఏంజిల్స్‌లో మొదలైన నిరసనలు ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు వ్యాపిస్తున్నాయి. సమస్యను తనదైన స్టైల్‌లో డీల్ చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు విమర్శలకు దారి తీస్తోంది. ఆందోళనకారులను రెచ్చగొట్టేలా నేషనల్ గార్డ్ దళాలను రంగంలోకి దించడంతో పరిస్థితి మరింత తీవ్రతరం అవుతోంది. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ మాట్లాడుతూ "ట్రంప్ సృష్టించిన తొలగించడానికి స్థానిక, రాష్ట్ర అధికారులతో సమావేశమయ్యాం" తెలిపారు.  

యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) ఏజెంట్లు నగరం అంతటా దాడులు నిర్వహించి, అక్రమ వలసదారులను అరెస్టు చేసిన తరువాత మిన్నంటాయి. వీటిని కంట్రోల్ చేయడానికి 2,000 నేషనల్ గార్డ్ దళాలను ట్రంప్ రంగంలోకి దించారు.  

"లాస్ ఏంజిల్స్‌లో శాంతిని కాపాడటానికి వ్యూహాలను చర్చించడానికి స్థానిక, రాష్ట్ర అధికారులతో చర్చించం. ట్రంప్‌ సృష్టించిన గందరగోళాన్ని తొలగించడానికి భద్రతను పునరుద్ధరించడానికి రాష్ట్ర, స్థానిక నాయకులు కృషి చేస్తున్నారు" అని న్యూసమ్ X లో తెలిపారు.

లాస్ ఏంజిల్స్‌లో నిరసనలపై ఉక్కపాదం మోపేందుకు నేషనల్ గార్డ్స్‌ను దించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని న్యాయమూర్తిని కోరుతూ కాలిఫోర్నియా పిటిషన్ వేసింది. మరిన్ని మోహరింపులు నిరోధించాలని కూడా విజ్ఞప్తి చేసింది.  

సోమవారం కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ దాఖలు చేసిన పిటిషన్‌పై వైట్‌హౌస్ ప్రతినిధి స్పందించారు. ట్రంప్ పరిపాలనపై పిటిషన్లు వేయడం కంటే "ICE వ్యతిరేక అల్లర్లు" విచారించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సెటైర్లు వేస్తున్నారు. 

"చట్టాన్ని చేయడం కంటే న్యూసమ్ తనను తాను  కాపాడటంపై ఎక్కువ దృష్టి పెట్టడం విచారకరం" అని వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ అన్నా కెల్లీ అన్నారు. "అధ్యక్షుడు చెప్పినట్లుగా, శాంతిభద్రతలను పునరుద్ధరించినందుకు న్యూసమ్ కృతజ్ఞతలు చెప్పాలి." అని చెప్పారు. 

కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా మాట్లాడుతూ రాష్ట్ర నేషనల్ గార్డ్ దళాలను సమీకరించాలనే నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు, దీనిని "అనవసరం లేనిదిగా, ప్రతికూలమైనదిగా, చట్టవిరుద్ధమైంది" అని అభివర్ణించారు.

ట్రంప్ పరిపాలనపై 19 వారాల్లో ఇప్పటికే కాలిఫోర్నియా 24 పిటిషన్లు వేసిందని బోంటా అన్నారు.

ట్రంప్ ఆదేశాలు సమాఖ్య అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని, రాజ్యాంగంలోని 10వ సవరణ, సమాఖ్య చట్టాన్ని ఉల్లంఘిస్తుందని బోంటా చెప్పుకొచ్చారు. గవర్నర్ గవిన్ న్యూసమ్ అనుమతి లేకుండా, స్థానిక సంస్థల ఇష్టానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.  

హెగ్సేత్ విస్తరణ రద్దు చేయాలన్న న్యూసమ్ అభ్యర్థనను పట్టించుకోలేదని బోంటా చెప్పారు.

ప్రదర్శన ఎందుకు జరుగుతోంది

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ దేశంలో పత్రాలు లేకుండా నివసిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీని కారణంగా, లాస్ ఏంజిల్స్‌లో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ విషయంలో దాడులు జరిగాయి, ఇందులో 44 మందిని అరెస్టు చేశారు. ఈ అరెస్టులు, దాడులకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి.

నేషనల్ గార్డ్స్ అంటే ఏమిటి ?

హింసాత్మక ఆందోళనల కారణంగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాస్ ఏంజిల్స్‌లో నేషనల్ గార్డ్‌లను మోహరించారు. నేషనల్ గార్డ్స్ ఆయుధాలతో లాస్ ఏంజిల్స్ వీధుల్లో మోహరించారు. నేషనల్ గార్డ్స్ అమెరికన్ సాయుధ దళాల రిజర్వ్ లో భాగం. ఇందులో రెండు శాఖలు ఉన్నాయి: ఆర్మీ నేషనల్ గార్డ్,, ఎయిర్ నేషనల్ గార్డ్. 1903లో మిలీషియా చట్టం ద్వారా ఇది ఏర్పడింది. నేషనల్ గార్డ్ సాధారణంగా అత్యవసర పరిస్థితులు, భూకంపాలు లేదా వరదల వంటి విపత్తు సహాయం అందించడానికి రంగంలోకి దించుతారు. ఇటీవల కాలిఫోర్నియా అడవుల్లో మంటలు చెలరేగినప్పుడు, వారిని పిలిపించారు. ఇది కాకుండా, అంతర్గత భద్రతను నిర్ధారించడానికి కూడా వాటిని మోహరిస్తారు.

నేషనల్ గార్డ్స్  పవర్ ఏంటీ?

లాస్ ఏంజిల్స్‌లో ఇమ్మిగ్రేషన్ విషయంలో దాడుల తర్వాత పరిస్థితి అదుపు తప్పింది.. ప్రజలు అమెరికన్ ఇమ్మిగ్రేషన్,, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE)కి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ గార్డుల పాత్ర ప్రజలను అదుపులోకి తీసుకోవడం. అదే సమయంలో, అమెరికన్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీతో సహా ఫెడరల్ ఏజెంట్లను రక్షించడం. ఈ సమయంలో ఈ సైనికులు ఇమ్మిగ్రేషన్ దాడులు చేయరు, పౌరులపై ఎటువంటి చర్యలు తీసుకోరు.

అధ్యక్షుడు ఎప్పుడు వారిని మోహరిస్తారు

అమెరికాలో, అధ్యక్షుడు మూడు పరిస్థితులలో ఈ గార్డులను మోహరించవచ్చు, మొదటిది అమెరికాపై విదేశీ రాజ్యం దాడి చేస్తే లేదా దాడి చేసే ప్రమాదం ఉంటే. రెండవది ప్రభుత్వంపై తిరుగుబాటు లేదా తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంటే , మూడవది అధ్యక్షుడు సాధారణ దళాల ద్వారా అమెరికా చట్టాలను అమలు చేయలేకపోతే.