Extreme tensions in Los Angeles : అమెరికా ప్రజలకు ప్రశాంతత కరవవుతోంది.ఏదో చోట వివాదం చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. ప్రస్తుతం లాస్ ఎంజెల్స్ ఉద్రిక్తంగా మారింది. ఎటు చూసినా తగలబడుతున్న కార్లు కనిపిస్తున్నాయి. పలు చోట్ల నిరసనలు జరుగుతూండంటో టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్ ఉపయోగించి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేషనల్ గార్డ్స్ ని మూడు ప్రాంతాలలో మోహరించి..ఆందోళనకారులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
గొడవలకు కారణం ఏణిటి ?
జూన్ 6న లాస్ ఏంజెల్స్ ఫ్యాషన్ డిస్ట్రిక్ట్‌లోని ఒక దుస్తుల గిడ్డంగి వద్ద, హోమ్ డిపో స్టోర్‌ల వద్ద, మరియు ఇతర ప్రాంతాలలో ICE అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఈ రైడ్స్‌లో 44 మందిని "అడ్మినిస్ట్రేటివ్ అరెస్ట్" చేశారు. అడ్డుకున్నందుకు అరెస్ట్ ఒకరిని చేశారు. ఈ రైడ్స్‌కు వ్యతిరేకంగా ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ కొంత మంది ఆందోళన చేపట్టారు. "ICE out of LA!" వంటి నినాదాలతో నిరసన తెలిపారు. కొందరు నిరసనకారులు కాంక్రీట్ బ్లాక్‌లు, ఇతర వస్తువులను అధికారులపై విసిరారు, దీనికి ప్రతిగా పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్, ఫ్లాష్-బ్యాంగ్ గ్రెనేడ్‌లను ఉపయోగించారు.
ట్రంప్ జోక్యంతో మరింతగా మంటలు
ఈ వివాదంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం ఆగ్నికి ఆజ్యం పోసినట్లయింది. లాస్ ఏెంజెల్స్ గవర్నర్ గావిన్ న్యూసమ్ అనుమతి లేకుండా డొనాల్డ్ ట్రంప్ 2,000 మంది కాలిఫోర్నియా నేషనల్ గార్డ్ సైనికులను లాస్ ఏంజెల్స్‌కు పంపారు. ఇలా పంపడాన్ని గవర్నర్ న్యూసమ్ , మేయర్ కరెన్ బాస్ "అక్రమం" , "అనైతికం" అని మండిపడ్డారు. నేషనల్ గార్డ్ మోహరింపు ఉద్రిక్తతలను మరింత పెంచింది. పారామౌంట్, కాంప్టన్ ప్రాంతాలలో నిరసనకారులు, ఫెడరల్ ఏజెంట్ల మధ్య ఘర్షణలు జరిగాయి. నిరసనకారులు షాపింగ్ కార్ట్‌లు, రీసైక్లింగ్ బిన్‌లతో రోడ్లను అడ్డుకున్నారు. డౌన్‌టౌన్ లాస్ ఏంజెల్స్‌లో నిరసనల కారణంగా 101 ఫ్రీవేను మూసియేలాస్ వచ్చింది.
ట్రంప్ వల్లే సమస్యలు
ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలు, మాస్ డిపోర్టేషన్‌లు , బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌ను రద్దు చేసే ప్రతిపాదనలతో ఒక్క సారిగా ప్రజల్లో అసహనం పెరుగుతోంది. నేషనల్ గార్డ్ మోహరింపు "రాష్ట్ర సార్వభౌమత్వానికి ఉల్లంఘన"గా ఆ రాష్ట్ర గవర్నర్ అంటున్నారు. ట్రంప్ పై మండిపడుతున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ "లా అండ్ ఆర్డర్" కోసం ఈ చర్యలు అవసరమని సమర్థిస్తోంది. నేషనల్ గార్డుల్ని వెనక్కి పిలిచేందుకు సిద్దంగా లేరు.