California Plane Crash News: గురువారం తెల్లవారుజామున శాన్ డియాగో పరిసరాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ విమానం కుప్పకూలిన దుర్ఘటనలో చాలా మంది చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. విమాన ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్ష్యుల ప్రకారం విద్యుత్ స్తంభాన్ని ఢీ కట్టడం వల్లే విమానం కుప్పకూలిందని చెబుతున్నారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించడం లేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని అసిస్టెంట్ ఫైర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ డాన్ ఎడ్డీ తెలిపారు.
విమానం ఎనిమిది నుంచి 10 మందిని తీసుకెళ్లగలదు. ప్రమాదం టైంలో విమానంలో ఎంతమంది ఉన్నారో స్పష్టంగా తెలియడం లేదు. ఇదే విషయాన్ని శాన్ డియాగో పోలీసులు, అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన పరిసరాల్లో ఉన్న వాళ్లెవరూ గాయపడలేదని అంటున్నారు.
“విమానం ఆ ప్రాంతంలో క్రాష్ ల్యాండ్ అయినప్పుడు జెట్ ఇంధనం కింద పడటంతో వీధికి ఇరువైపులా ఉన్న కార్లు తగలబడిపోయాయి. అని ఎడ్డీ చెప్పారు.
కూలిపోయిన విమానం గురించి శాన్ డియాగో అధికారులు వివరాలను విడుదల చేయలేదు కానీ అది మిడ్‌వెస్ట్ నుంచి వస్తున్న విమానం అని చెప్పారు.
కాన్సాస్‌లోని విచిటాలోని స్మాల్ కల్నల్ జేమ్స్ II జబారా విమానాశ్రయం నుంచి తెల్లవారుజామున 3:47 గంటలకు బయల్దేరింది. శాన్ డియాగోలోని మోంట్‌గోమెరీ-గిబ్స్ ఎగ్జిక్యూటివ్ విమానాశ్రయానికి చేరుకోవాల్సిన ఉంది. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో కార్లు దగ్ధమయ్యాయి. దాదాపు 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. "ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయినప్పటి నుంచి అన్ని ప్రాంతాల్లో జెట్ ఇంధనం ఉంది" అని ఎడ్డీ అన్నారు. ఆ ఇళ్లను తనిఖీల చేసి శిథిలాల్లో ఉన్న వారిని బయటకు తీసుకురావడంపై ఫోకస్ చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రైవేట్ విమానం కూలిపోయిన సమయంలో చాలా పొగమంచు ఉందని ఎడ్డీ చెప్పారు.
ప్రమాదం జరిగిన పరిసరాల్లో "చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి." అని ఆయన అన్నారు. ఆ ప్రాంతంలో ఓ ఇంటి పైకప్పు పూర్తిగా కాలిపోయినట్టు కనిపిస్తోంది. తెల్లటి లోహపు ముక్క ఒకటి ఉంది. అర డజను పూర్తిగా కాలిపోయిన కార్లు ఉన్నాయి. చెట్ల కొమ్మలు, గాజు, తెలుపు, నీలం లోహపు ముక్కలు రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్నాయి. ఆ ప్రాంతం చివర్లో నల్లటి పొగ కమ్ముకుంది. ఆ ప్రదేశం కాలిపోతూనే ఉంది.
ప్రమాదం జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో ఉన్న వ్యక్తులు తాము ఏదో శబ్ధం విని మేల్కొని చూస్తే పొగ కనిపించాయని అంటున్నారు. భయంతో వాళ్లాంతా తమ పిల్లలను నిద్ర నుంచి లేపి వారిని తీసుకొని పరుగెత్తినట్టు చెబుతున్నారు. అలా వెళ్లిపోతున్న టైంలో కార్లు కాలిపోతున్న చూశామని అంటున్నారు.
పోలీసులు ఓ ఇంటి నుంచి మూడు హస్కీ కుక్కపిల్లలను రక్షించి, వాటిని ఒక వ్యాగన్‌లో ప్రమాద స్థలం నుంచి దూరంగా తీసుకెళ్లారు. కొన్ని బ్లాక్‌ల దూరంలో కొన్ని కుటుంబాలు పార్కింగ్ స్థలంలో నిలబడి, తమ ఇళ్లకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు.