US U Visa Scam: అక్రమంగా అమెరికాలో ఉండే వాళ్లందర్నీ ఇంటికి పంపిస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అందు కోసం ఏర్పాట్లు చేశారు. అయితే మనోళ్లు ట్రంప్ ను కూడా అవలీలగా మోసం చేసేస్తున్నారు. దానికి ఈ కేే సాక్ష్యం.
న్యూయార్క్‌లో నివసిస్తున్న భారతీయ జాతీయుడు రాంభాయ్ పటేల్ ను అమెరికా పోలీసులు అరెస్టు చేశాడు. ఇతను అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో రిటైల్ స్టోర్ల వద్ద నకిలీ ఆయుధ దోపిడీలను నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఎవరైనా నిజం దోపిడీలు చేస్తారు. కానీ రాంబాయి పటే మాత్రం తన సహచరుడు బల్విందర్ సింగ్ తో కలిసి నకిలీ దోపిడీలు నిర్వహించాడు. ఏమీ దోచుకోలేదు. అతని ఉద్దేశం దోపిడీలు చేయాలని కాదు.. అలా చేసి ఇతరులకు వీసాలు ఇప్పించాలని .
తన ఉత్తుత్తి దోపిడీల్లో కొంత మంది బాధితులు ఉంటారు. వారికి వీసాలు ఖరారు చేసేందుకు వారిని దోపీడే చేసేందుకు ప్లాన్ చేశారు. దోపిడీకి గురయితే చేస్తే వీసాలిస్తారా అన్న డౌట్ రావొచ్చు. కానీ అమెరికాలో ఇస్తారు.
అమెరికాలో ఉండేందుకు చాలా రకాల వీసాలు ఉన్నాయి. అందుకే U వీసా అనే అవకాశం ఉంది. ఇది ఒక నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. నిర్దిష్ట నేరాల బాధితులైన అక్రమ ఇమ్మిగ్రెంట్లకు చట్టపరమైన హోదాను అందించడానికి రూపొందించారు. నేరాల బాధితులను రక్షించడం . వారిపై నేరాలకు పాల్పడ్డ వారిపై కేసులు పెట్టి న్యాయవిచారణ జరిగేలా ప్రోత్సహించడం, అలాగే డిపోర్టేషన్ భయం లేకుండా చట్ట అమలు సంస్థలతో సహకరించేలా చేయడం కోసం ఈ వీసా ఉంది. దీన్ని అవకాశంగా మార్చుకున్న రాంబాయ్ పటేల్.. అంటే అమెరికాలో ఉండిపోవాలనుకుంటున్న వారిని దోపిడీ బాధితులుగా ప్రొజెక్ట్ చేసి యూ వీసాలు ఇప్పించడానికి ప్లాన్ చేశాడు.
వాళ్లు పని చేస్తున్న చోట నకిలీ దోపిడీలు చేసి పారిపోయేవాడు. వారిని బాధితులుగా మార్చి.. యూ వీసా లకు అప్లయ్ చేయించేవాడు. పటేల్ గ్యాంగ్ చేసిన ఈ నకిలీ దోపిడీల ఆధారంగా U-వీసా దరఖాస్తులు సమర్పించారు. అయితే అమెరికా అధికారులు గుర్తించారు. రాంభాయ్ పటేల్‌పై వీసా మోసం కుట్ర కేసులు పెట్టారు. రాంభాయ్ పటేల్ తన నేరాన్ని అంగీకరించాడు.
ట్రంప్ పరిపాలన అక్రమ ఇమ్మిగ్రెంట్లను అమెరికాలో ఉండకుండా చేయడానికి U-వీసా ప్రోగ్రామ్‌లోని లోటును సరిచేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ దర్యాప్తులో, ఇలాంటి నకిలీ దోపిడీ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి.