Michigan meteorite:  వజ్రం రూపంలో ఉండే పేపర్ వెయిట్స్ ను చాలా సార్లు చూసి ఉంటారు. అది నిజంగా వజ్రం అయి ఉంటే అనే కాన్సెప్ట్ మీద సినిమాలు  కూడా వచ్చాయి. అయితే నిజంగా వజ్రం అయితే దాన్ని అలా వాడినన్ని రోజులు తెలియదు..కానీ తెలిసిన తర్వాత ఆ వజ్రం యజమాని ఆనందానికి హద్దు ఉండదు. అలాగే మిచిగాన్ లోని ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురయింది. అయితే ఇది వజ్రం కాదు..  ఉల్క పాతంలో నుంచి భూమిపై పడిన రాయి. 

మిచిగాన్‌లోని ఎడ్మోర్‌కు చెందిన డేవిడ్ మజురెక్ అనే రైతు 30 సంవత్సరాలకు పైగా ఒక భారీ రాయిని తన  పశువుల పాక  తలుపు తెరిచి ఉంచడానికి ఉపయోగించేవాడు. ఆ రాయి తీసేస్తే  ఆ తలుపు పడిపోతుంది. అతను 1988లో అతను ఆ ఆస్తిని కొనుగోలు చేశాడు. అప్పుడే   ఈ 22.5 పౌండ్ల రాయి ఆస్తితో పాటు వచ్చింది. ఇటీవల  మిచిగాన్‌లో చిన్న ఉల్కల రాళ్లు దొరుకుతున్నాయని ప్రచారం జరిగింది. దీంతో తన ఇంట్లోని రాయి కూడా అలాంటిదేమోనని డౌట్ డేవిడ్ కు వచ్చింది. అందుకే తన రాయిని పరిశీలించడానికి సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీ (CMU)కి తీసుకెళ్లాడు. CMUలో భూగర్భ శాస్త్రవేత్త అయిన డాక్టర్ మోనలిసా సిర్బెస్కు ఈ రాయిని పరిశీలించి, అది 88 శాతం ఇనుము, 12 శాతం నికెల్‌తో కూడిన అరుదైన ఇనుము-నికెల్ ఉల్క అని ధృవీకరించారు.  ఈ ఉల్క రాయిని  ఇప్పుడు "ఎడ్మోర్ ఉల్క"గా పిలస్తున్నారని.. దీని విలువ లక్ష డాలర్లుగా ఉంటుందని అంచనా వేశారు.                       

దాన్ని రాయిని మళ్లీ డోర్ కు అడ్డం పెట్టే పనికి వాడవద్దని కాపాడుకోవాలని సలహా ఇచ్చింది. దాంతో డేవిడ్  స్మిత్సోనియన్ ఇన్‌స్టిట్యూషన్‌కు అమ్మడానికి లేదా ఎగ్జిబిషన్ కోసం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు.  అమ్మితే తన లాభంలో 10 శాతం CMU జియాలజీ విభాగానికి దానం చేయాలని నిర్ణయించాడు. ఈ రాయి మిచిగాన్‌లో ఉల్కల గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. మనం ఊహించని వస్తువులు కూడా  అసాధారణ విలువను కలిగి ఉండవచ్చని  అనుకుంటున్నారు. 

ఈ విషయం తెలిసిన తర్వాత డేవిడ్‌కు ఆ ఆస్తి అమ్మిన యజమాని కూడా ఆ రాయి తనకు ఎలా దొరికిందో వివరించాడు.    1930లలో ఈ రాయి ఆకాశం నుండి పడినప్పుడు  గట్టిగా శబ్దం వచ్చిందని, మరుసటి రోజు ఉదయం సేకరించినప్పుడు అది ఇంకా  వేడిగా ఉందని గుర్తు చేసుకున్నాడు. మొత్తంగా ఇప్పుడా ఉల్కను కొనే వారి కోసం డేవిడ్ ఎదురు చూస్తున్నాడు.