International Trip Planning From India : ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలే కాదు.. సామాన్యులు కూడా ట్రిప్స్​కి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తక్కువ ఖర్చుతో ఇతర దేశాలకు కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అలా మీరు కూడా మొదటిసారి ఇంటర్నేషనల్​ ట్రిప్​కి వెళ్లాలనుకుంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే మంచిది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా విదేశాలకు వెళ్లి రావాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

పాస్​పోర్ట్

దేశాన్ని విడిచి ట్రిప్​కి వెళ్లాలనుకుంటే కచ్చితంగా పాస్​పోర్ట్​ను చెక్ చేసుకోవాలి. మీ ప్రయాణ తేదీ నుంచి కనీసం 6 నెలల వరకు వీసా చెల్లుబాటులో ఉండేలా చూసుకోవాలి. అలాగే ముందుగానే వీసా కోసం అప్లై చేసుకోవాలి. వీసా కోసం అవసరమైన పత్రాలు, ప్రాసెసింగ్ సమయాన్ని తెలుసుకోవాలి. మీ పాస్​పోర్ట్, వీసా, ట్రావెల్ ఇన్సూరెన్స్ బీమా జిరాక్స్​లు తీసుకెళ్తే మంచిది. డిజిటల్ కాపీలు ఈమెయిల్ లేదా గూగుల్ డ్రైవ్​లో ఉంచాలి. 

డెస్టినేషన్..

మీరు ఏ దేశానికి వెళ్లాలనుకుంటున్నారో దాని గురించి వెళ్లే ముందు రీసెర్చ్ చేసుకోవడం మంచిది. అక్కడ చట్టాలు ఏంటి? ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? కల్చర్ ఏంటి? వంటి విషయాలు తెలుసుకోవాలి. అలాగే వాతావరణం ఎలా ఉంటుంది? ఎమర్జెన్సీ నెంబర్స్​తో పాటు ఇండియన్ ఎంబసీ కాంటాక్ట్ కూడా తెలుసుకోవాలి. అక్కడి భాషను అర్థం చేసుకునేందుకు ట్రాన్సలేషన్ యాప్స్ డౌన్​లోడ్ చేసుకుంటే మంచిది. 

ఆరోగ్యం 

కొన్ని దేశాలు కొన్ని రకాల వ్యాక్సిన్ల సర్టిఫికెట్స్ అడుగుతాయి. కాబట్టి వాటిని ముందుగానే తీసుకుంటే మంచిది. అలాగే మీతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకువెళ్తే మంచిది. వైద్యులు సూచించిన మెడిసన్స్ తీసుకువెళ్లొచ్చు. ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది. 

డబ్బులు 

మీరు వెళ్లే దేశానికి సంబంధించిన కరెన్సీని ముందుగానే కాస్త తీసుకుంటే మంచిది. మీ ఇంటర్నేషనల్ ట్రావెల్ గురించి ముందుగానే బ్యాంక్​కు ఇన్ఫార్మ్ చేయాలి. కార్డ్ బ్లాక్ అవ్వకుండా ఇది హెల్ప్ అవుతుంది. అలాగే ఇంటర్నేషనల్ డెబిట్, క్రెడిట్, ఫోరెక్స్ కార్డ్ తీసుకోవాలి. 

ఇంటర్నెట్

ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్ తీసుకోవాలి. లేదా మీరు వెళ్లిన దేశంలో లోకల్ సిమ్ తీసుకోవాలి. అలాగే ఆఫ్​లైన్ మ్యాప్స్ డౌన్​లోడ్ చేసుకోవాలి. హోటల్ బుకింగ్స్, లాంగ్వేజ్ ట్రాన్సలేషన్ యాప్స్ కూడా ఆఫ్​లైన్​లో వర్క్ చేసేవి చూసుకోవాలి. వాట్సాప్, గూగుల్ మీట్, వైఫ్ ద్వారా మీవారితో కనెక్షన్​లో ఉంటే మంచిది. 

ప్యాకింగ్ 

మీ ఎయిర్​లైన్ బ్యాగేజీ విషయంలో ఎలాంటి రూల్స్ పెడుతుందో తెలుసుకోండి. అలాగే అక్కడి ప్రదేశానికి తగ్గట్లు మీ డ్రెస్​లు ఉండేలా ప్యాక్ చేసుకోవాలి. పవర్​ బ్యాంక్ కచ్చితంగా ఉండేలా చూసుకోండి. యూనివర్సల్ అడాప్టర్, ట్రావెల్ సైజ్ టాయిలెట్రీస్ వంటివి ప్యాక్ చేసుకోవాలి. పాస్​పోర్ట్, క్యాస్, ఎలక్ట్రానిక్స్ వంటివి హ్యాండ్ లగేజ్​లో ఉంచుకోవాలి.

ఎయిర్​పోర్ట్​ 

మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్​ జర్నీ చేసేప్పుడు కనీసం 3 గంటల ముందే అక్కడ ఉండేలా చూసుకోండి. మీ పాస్​పోర్ట్, వీసా, బోర్డింగ్ పాస్​లను ఇమ్మిగ్రేషన్ కోసం రెడీగా పెట్టుకోవాలి. సెక్యూరిటీ చెక్స్​కి సపోర్ట్ చేయాలి. 

హోటల్స్

మీరు వెళ్లే ప్రదేశంలో రివ్యూల ఆధారంగా, ఇతరుల సలహాల మేరకు ముందుగానే అక్కడ హోటల్స్ లేదా హోమ్ స్టేలు బుక్ చేసుకోవాలి. మొత్తం అడ్రెస్​తో పాటు, కాంటాక్ట్ డిటైల్స్ తీసుకోవాలి. మీ ఎయిర్​పోర్ట్​ నుంచి హోటల్​కి ఎంత దూరమో తెలుసుకోవాలి. అలాగే మీరు

చూడాలనుకునే ప్రదేశాలకు దగ్గర్లో హోటల్స్ బుక్ చేసుకుంటే మంచిది. గూగుల్ మ్యాప్స్, లోకల్ మెట్రోలు, బస్సుల్లో ప్రయాణిస్తే మంచిది. వీటితో పాటు ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్​కి ఎల్లప్పుడూ కాంటాక్ట్​లో ఉండాలి.. అలాగే ఎమర్జెన్సీ నెంబర్స్​ కచ్చితంగా రాసుకోవాలి. పాస్​పోర్ట్ పోతే గనుక వెంటనే దగ్గర్లో ఉన్న ఇండియన్ ఎంబసీకి కాంటాక్ట్ అవ్వాలి.