Nindu Noorella Saavasam Serial Today Episode:  అమర్‌, భాగీ, చిత్ర, వినోద్‌ నలుగురు కలిసి బెస్ట్‌ కపుల్‌ కాంపిటీషన్‌కు వెళ్తారు. అక్కడ కారు దిగిగానే భాగీ లోపలకు వెళ్తున్న వాళ్లను చూసి టెన్షన్‌ పడుతుంది. కానీ అదంతా ఎవ్వరికీ కనిపించకుండా మేనేజ్‌ చేయాలనుకుంటుంది.

అమర్‌: భాగీ వెళ్దామా… భాగీ..

భాగీ: అప్పుడే వచ్చేశామా అండి.. ఎవ్వరూ టెన్షన్‌ పడకండి. పెద్ద పెద్ద గేమ్స్‌ ఏమీ ఉండవు. చిన్న చిన్న గేమ్సే ఉంటాయి. మళ్లీ చెప్తున్నాను ఎవ్వరూ టెన్షన్‌ పడకండి.

అమర్‌: ఏయ్‌ లూజ్‌ నువ్వు తప్పా ఎవ్వరూ టెన్షన్‌ పడటం లేదు

భాగీ: అవును మీరెందుకు టెన్షన్‌ పడటం లేదు.

చిత్ర: ఎందుకు టెన్షన్‌ భాగీ నువ్వే చెప్పావు కదా అన్ని చిన్న చిన్న గేమ్సే అని ఇంకెందుకు టెన్షన్‌

భాగీ: చెప్పాను కానీ మరీ అంత చిన్నగా.. మరీ అంత సున్నితంగా పెట్టరు కదా..? ఫ్రైజ్‌ మనీ గట్టిగా వచ్చేటప్పుడు కాంపిటీషన్‌ కూడా టఫ్‌గా ఉంటుంది కదా

చిత్ర: బావగారు ఫ్లీజ్‌ ఏమీ అనుకోకండి ఇక్కడే ఉంటే భాగీ టెన్షన్‌ పడుతూనే మమ్మల్ని కూడా టెన్షన్‌ పెడుతుంది. నేను వినోద్‌ ముందు వెళ్తాం మీరు మాత్రం తర్వాత రండి. పద వినోద్‌ వెళ్దాం

అని చెప్పి చిత్ర, వినోద్‌ లోపలికి వెళ్లిపోతారు.

భాగీ: లైట్‌గా టెన్షన్‌ పడుతున్నా అంతే కదండి.. చిత్రనే కదా ఓవర్‌గా రియాక్షన్‌ అవుతుంది. నిజంగా నాకేం అర్థం కావడం లేదండి నాకు నిజంగా టెన్షన్‌ వచ్చేస్తుంది. కాదండి నేను టెన్షన్‌ పడుతున్నానా..? అది కాదండి నాకు..

అమర్‌, మిస్సమ్మ చేయి పట్టుకుని

అమర్‌: ఇప్పుడు చెప్పు ఎందుకు టెన్షన్‌ పడుతున్నావు

భాగీ: ఈ కాంపిటీషన్‌లో మనం ఎలాగైనా గెలవాలండి. పిల్లలకు మనం హెల్ఫ్‌ చేయాలండి

అమర్‌: మనం గెలుస్తున్నాం.. పిల్లలకు హెల్ప్ చేస్తున్నాం.. అయినా మన మీద మనకు నమ్మకం లేకపోతే ఎలా చెప్పు

భాగీ: నా మీద నాకు కాన్పిడెంట్‌ ఉందండి కానీ మీ మీదే లేదు. ( అమర్‌ కోపంగా చూస్తాడు) అలా కాదండి.. నమ్మకం ఉందండి.. నిజంగా ఉందండి.. కానీ..

అమర్‌: కానీ…ఏంటి..? చెప్పు..

భాగీ: మీరు ఎప్పుడు యుద్దానికి సిద్దంగా ఉన్నట్టు ఉంటారు. మిమ్మల్ని చూడగానే భయం వేస్తుంది. సారీ అండి ఏదో కంగారులో నిజాలన్నీ చెప్పేస్తున్నాను. అయినా ఇలా తిరగండి ఇలా ఉండండి.. ఇప్పుడు చూడండి ఎంత క్యూట్‌గా ఎంత అందంగా ఉన్నారో.

అమర్‌: ఇక్కడికి నన్ను గేమ్స్‌ ఆడటానికి తీసుకొచ్చావా..? లేకపోతే నేను కోపిస్టి అని ఫ్రూప్‌ చేయడానికి పిలిపించావా..?

భాగీ: మీరు కోపిస్టి అని నేను ఫ్రూప్‌ చేయడం కాదండి రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసు కదా..? అంటే మీరు కోపిస్టి ఏంటండి.. ఏయ్‌ ఎవరు..?  ఎవరు చెప్పండి..? మీరు ఎవరైనా అన్నారా..? సరే సారీ వెళ్దాం పదండి

అనగానే ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. అంతకు ముందే లోపలికి వెళ్లిన చిత్ర మనోహరి గురించి ఆలోచిస్తుంది.

చిత్ర: మను ఇక్కడ ఎవరినో సెట్‌ చేస్తాను అని చెప్పింది ఎవరిని చేసిందబ్బా (మనసులో అనుకుంటుంది)

వినోద్‌:  చిత్ర మనం ఈ కాంపిటీషన్‌ లో పార్టిసిపేట్‌ చేయాలంటావా..?

చిత్ర: వినోద్‌ ఫ్లీజ్‌ నాకు కోపం తెప్పించే మాటలు మాట్లాడకు.. ఒక పని చేయ్‌ మనం ఇక్కడి నుంచి వెళ్లే వరకు అవసరం అయితే తప్పా ఇంక ఏమీ మాట్లాడకు.. నాతో మాత్రం అసలు మాట్లాడకు

వినోద్‌:  అది కాదు చిత్ర అన్నయ్య వెనక నిలబడటం తప్పా ఇలా ఎదురు పోటీ పడటం నాకు ఎప్పుడు తెలియదు ఇదంతా నాకు కొత్తగా ఉంది

చిత్ర: అలా వెనక ఉన్నావు కాబట్టే ఇలా వెనకబడి పోయావు. ముందుకు వచ్చే టైం వచ్చింది.. టైం అంటే గుర్తుకు వచ్చింది.. కాంపిటీషన్‌ స్టార్ట్‌ అయ్యే టైం వచ్చింది. నేను మనుకు కాల్ చేసి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు ఓకే..

అని చెప్పి చిత్ర పక్కకు వెళ్లిపోతుంది. వినోద్‌ కోపంగా చిత్రను చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!