ర్యాపర్స్ అంటే ఎలా ఉండాలి..? ఎలా ఉండాలన్న సంగతి తర్వాత ముందుగా ర్యాప్ సాంగ్స్‌లో మాత్రం వినేవాళ్లను ఆకట్టుకునేలా పాడాలి. అయితే ప్రపంచంలో ఉన్న ర్యాపర్లను పరిశీలిస్తే వారి పాటలతో పాటు వారి వేషధారణ కూడా అంతే భిన్నంగా ఉంటుంది. అలా ఉంటనే తమ ప్రత్యేకత చాటుకుంటామన్నట్లుగా వారి స్టైల్ ఉంటుంది. ఈ పద్దతిలోనే మరింత నాటు పద్దతిలోఫాలో అయ్యాడు మెక్సికన్ ర్యాపర్ డాన్ సుర్. పేరే కాస్త విచిత్రంగా ఉంటుందని అనుకుంటే ఈ ర్యాపర్ తన వేషాన్ని కూడా అంతే విచిత్రంగా మార్చేసుకున్నాడు.






ఈ డాన్ సుర్ కి బంగారం అంటే మోజు. అందుకే మొత్తంగా గోల్డ్ తోనే తన స్టైల్‌ ఉండేలా చూసుకోవాలనుకున్నాడు. ఏం చేయాలా అని ఆలోచించి చివరికి జుట్టు అంతా కత్తించేసుకున్నాడు. ఇక మొలిపించాలని అనుకోలేదు. మరి ఏం చేయాలనుకున్నాడంటే.. అక్కడ బంగారం గొలుసులు ఇంప్లాంట్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. దాని కోసం వైద్య నిపుణుల్ని  సంప్రదించాడు. చివరికి సర్జరీలకు రెడీ అయిపోయాడు. వరుస సర్జరీలు చేయించుకుని గొలుసుల్ని జన జుట్టుగా మార్పించుకున్నాడు. తన రూపం ఎలా వచ్చిందో ఇన్‌స్టాలో పోస్ట్ చేసుకున్నాయి.






అయితే ఆ రూపం చూసి సరైన ఫీల్ రాదని అనుకున్నారేమో అంటే జుట్టు దగ్గర గొలుసులు ఉన్నాయి సరే.. మరినోరు తెరిచినప్పుడు ప ళ్లు కనిపిస్తే ఎలా అని అకున్నాడేమో కానీ దానికి కూడా బంగారం పూత పూయించేశాడు. అది పూత పూయించాడా లేకా ఉన్న పళ్లన్నీ ఊడగొట్టించేసుకుని బంగారం పళ్లు పెట్టించుకున్నాడా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ నోరు తెరిస్తే మాత్రం జిగేలుమని మెరిసే బంగారం పళ్లే కనిపిస్తూ ఉంటాయి.






డాన్ సుర్ కి ఇరవై ఆరు ఏళ్లు మాత్రమే. ఆయన పాటలంటే మెక్సికన్ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. వారిని మరింత ఆకట్టుకోవాలంటే ఇలా విచిత్రమైన రూపం ఉండాలని అనుకున్నాడు. సాధించాడు. అమెరిక‌న్ ర్యాపర్స్ ఎవరూ సరిగ్గా ఉండరు. విభిన్నమైన వేషాధారణతో ఉంటారు. దాన్నే డామ్ సుర్ కూడా ఫాలో అయ్యారు. అయితే వారికి తగ్గట్లుగా ఫాలో యింగ్ వస్తుందో రాదో చెప్పడం కష్టం... కానీ ఇప్పటికైతే తన లక్ష్యం ప్రకారం ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చేసుకున్నాడు. 


Also Read : బాలకృష్ణ మాస్ డైలాగుల్ని చెబుతున్న ఆస్ట్రేలియా బాతు ! ఇప్పుడది వరల్డ్ ఫేమస్ తెలుసా..?


Also Read : ఉద్యోగికి ఓ గంట పర్మిషన్ అడిగితే ఇవ్వలేదు.. సీన్ కట్‌ చేస్తే రూ.2 కోట్లకు బ్యాండ్‌..