Chile Earthquake: చిలీ-అర్జెంటీనా సరిహద్దులో భారీ భూకంపం ఏర్పడింది. చిలీలో ఏర్పడిన భూకంప తీవ్ర రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. చిలీలోని సాన్ పెడ్రో డే, అటకామాకు సుమారు 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. బూకంప వచ్చిన వెంటనే సునామీ హెచ్చరికలను అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ జారీ చేసింది.
పసిఫిక్ మహా సముద్రంలో భారీగా భూకంపాలు వస్తుంటాయి. అందుకే దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. అలాంటి రింగ్ ఆఫ్ ఫైర్ భూభాగంలో ఉన్న చిలీని తరచూ భూకంపాలు వణికిస్తుంటాయి. భూకంపాలు రావడం వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేయడం ఇక్కడ సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అక్కడ కట్టడాలు కూడా భూకంపాలు, సునామీలను తట్టుకునేలా ఉంటాయి.