Donald Trump: ఇరాన్ వెనక్కి తగ్గకపోతే మళ్లీ దాడి చేస్తాం, అణు స్థావరాలపై దాడుల అనంతరం డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
America Attacks Trump | ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడి చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల్లో నేరుగా తలదూర్చుతూ 3 అణు స్థావరాలపై దాడులు చేయడంతో పాటు ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు.
Donald Trump Warns Iran after Attacks: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల్లో అమెరికా నేరుగా రంగంలోకి దిగింది. అమెరికా సైన్యం ఇరాన్ లోని 3 అణు స్థావరాలపై దాడి చేసింది. తమ అణు స్థావరాలపై అమెరికా చేసిన దాడిని ఇరాన్ మీడియా ధృవీకరించింది. అమెరికా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇస్ఫహాన్, నటాంజ్, ఫోర్డో అణు స్థావరాలపై అమెరికా దాడి చేసిందని తెలిపారు. ఈ విషయంలో వైట్ హౌస్ అధికారులు సీఎన్ఎన్‌తో మాట్లాడుతూ.. ఇరాన్ అణు స్థావరాలపై దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. యుద్ధాన్ని వీలైనంత త్వరగా ఆపాలని లేకపోతే మళ్లీ దాడి చేస్తామని ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు. తమకు మద్దతుగా నిలిచి ఇరాన్‌పై దాడి చేసినందుకు ట్రంప్‌కు నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు.
రాయిటర్స్ ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఫోన్ కాల్‌లో న్యూజ్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. ఇరాన్ వెంటనే తమ చర్యలను ఆపాలి. లేకపోతే వారు మళ్లీ దాడులను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. అయితే, అమెరికా దాడికి ముందే యురేనియం నిల్వలను ఖాళీ చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. మార్చి నెలలోనే అణు ఆయుధాలను తయారు చేసే ముడి సరుకును సరైన స్థలాలకు తరలించామని, ఇజ్రాయెల్ ఎప్పుడైనా దాడి చేయవచ్చని ముందే ఊహించామని ఇరాన్ గతంలో పేర్కొంది.
Just In
అమెరికా బాంబు దాడి తర్వాత ట్రంప్‌పై ప్రశంసలు
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడుల తర్వాత చాలా మంది రిపబ్లికన్ సెనేటర్లు అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రశంసించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం (జూన్ 21, 2025) సాయంత్రం అమెరికా సైన్యం ఇరాన్‌లో 3 స్థావరాలపై బాంబు దాడి చేసిందని కీలక ప్రకటన చేశారు. దీనిపై సెనేటర్ లిండ్సే గ్రాహం, ఆర్-ఎస్.సి. Xలో పోస్ట్ చేశారు. వెరీ గుడ్ ప్రెసిడెంట్ ట్రంప్ అని పోస్ట్ చేశారు. టెక్సాస్ సెనేటర్ జాన్ కార్నిన్ ఇరాన్ అణు కేంద్రాలపై దాడిని సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణించారు. అలబామా సెనేటర్ కేటీ బ్రిట్ తాను ట్రంప్‌తో ఏకీభవిస్తానని.. బాంబు దాడిని బిగ్ ట్రీట్మెంట్‌గా అభివర్ణించారు. ఓక్లహోమా సెనేటర్ మార్క్‌వెన్ ముల్లిన్ సైతం అమెరికా దాడులకు మద్దతు తెలిపారు.
పెన్సిల్వేనియాకు చెందిన డెమోక్రటిక్ సెనేటర్ జాన్ ఫెటర్‌మన్ కూడా ఇరాన్ అణు స్థావరాలపై జరిగిన దాడులను ప్రశంసించారు. అతను తన పోస్టులో.. నేను గతంలోనే చెప్పినట్లుగా, ఇది సరైన చర్య. ఇరాన్ ప్రపంచంలో ఉగ్రవాదానికి ప్రధాన స్పాన్సర్, అందుకే ఆ దేశం అణు సామర్థ్యాన్ని కలిగి ఉండకూడదు’ అని పోస్ట్ చేశారు. కెంటుకీ ప్రతినిధి థామస్ మాస్సీ ఇది రాజ్యాంగబద్ధం కాదని పేర్కొన్నారు. విదేశాల మధ్య యుద్ధాలలో అమెరికా ప్రమేయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వస్తే అందులో అమెరికా ప్రమేయం అవసరం ఏంటని ప్రశ్నించారు. ఇతర దేశాల వ్యవహారాలలో తలదూర్చడం ట్రంప్‌నకు అలవాటేనని ఇరాన్‌లోని మూడు ప్రధాన అణుస్థావరాలపై దాడులను తీవ్రంగా విమర్శించారు.
ఓవైపు తనకు నోబెల్ శాంతి బహుమతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరోవైపు ఇలా విదేశీ వ్యవహారాలలో తలదూర్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనకు నోబెల్ శాంతి బహుమతి ఎందుకు ఇవ్వరని సైతం ట్రంప్ ప్రశ్నిస్తున్నారు.