మరుపు అనేది సహజం.. బాధించే జ్ఞాపకాలను మరిచిపోతేనే మంచిది. మనసుకు హాయినిచ్చేవి గుర్తు పెట్టుకోవాలి. కానీ లైఫ్ లో జరిగే పెద్ద విషయాలు కూడా మర్చిపోతే ఎలా? కష్టమే.. అసలు పెళ్లాం ఎవరో... పిల్లలు ఎవరో అనేంతలా మరిచిపోతే.. చుట్టూ ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటి? ఓ వ్యక్తి ఇలానే.. ఒక్క నిద్రలో గతాన్ని మరిచిపోయాడు.
అమెరికాలోని టెక్సాస్ లోని గ్రాన్ బరీలో డానియల్ అనే వ్యక్తి రాత్రి పడుకున్నాడు. ఉదయం నిద్రలేవగానే.. తాను పడుకున్న బెడ్రూం చూసి షాక్ అయ్యాడు. ఇదేంట్రా బాబు అసలు నేను ఎక్కడున్నా.. అని ఉలిక్కిపడ్డాడు. నా వయసు 16 ఏళ్లే కానీ నేను ఎందుకు ఇంత పెద్దగా ఉన్నా అనుకున్నాడు. స్కూల్ కు రెడీ అవుతూ.. ఏదేదో అరుస్తున్నాడు. ఈ సమయంలోనే ఓ మహిళ అతడి దగ్గరకు వచ్చింది. ఆమెను చూసి డేనియల్ అవాక్కయ్యాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ మహిళ ఎవరో కాదు డానియల్ భార్యే. నేను నీ భార్య రుత్ ను అని చెబుతున్నా.. అసలు నా వయసేంత.. నువ్ నా భార్య ఏంటీ.. అని ఆమెపై అరిచాడు. ఈ ప్రవర్తన చూసిన ఇంట్లో వాళ్లకు నోట మాట రాలేదు. వాళ్ల పదేళ్ల కూతురు గురించి చెప్పినా.. బిత్తరపోయాడు. నేనే స్కూల్ కి వెళ్లే పిల్లాడిని నాకు కూతురేంటి అని ఎదురు ప్రశ్నించాడు. చాలా సేపు డానియల్, రుత్ వాదించుకున్నారు. ఇక లాభం లేదని అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
డానియల్ ఉదయాన్నే అతడు నిద్రలేచాడు. నేను ఎవరో తెలియనట్లు చూశాడు. చాలా గందరగోళానికి గురయ్యాడు. మేం ఉన్న గదిని కూడా అతడు గుర్తుపట్టలేదు. బాగా తాగేసి ఆ ఇంటికి వచ్చానా.. లేక ఎవరైనా కిడ్నాప్ చేసి రూమ్‌లో బంధించారా అని అనుకున్నాడు. నా భర్త మా గది నుంచి బయటకు పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత డానియల్ కు నేను తన భార్యనే అని చెప్పాను. అతడు ఇంకా చిన్నపిల్లాడే అనుకున్నాడు. అద్దంలో చూసుకుని ఆగ్రహానికి గురయ్యాడు. అతడు హియరింగ్ స్పెషలిస్ట్. అయినా తన ఉద్యోగం, చదువు అన్నీ మరిచిపోయాడు. కాబట్టి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లాం.
రుత్, డానియల్ భార్య
డానియల్ ను వైద్యులు పరీక్షించారు. అతడు ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీసియాతో బాధపడుతున్నట్లు చెప్పారు. దానినే షార్ట్ టెర్మ్ మెమోరిలాస్ అంటారని తెలిపారు. 24 గంటల్లో సర్దుకుంటుందని తెలిపారు. కానీ ఇప్పటికి ఏడాది అవుతుంది. అయితే.. పాత జ్ఞాపకాలు ఏమైనా.. గుర్తుకు వస్తాయేమోనని.. చిన్నప్పుడు డానియల్ తిరిగిన ప్రదేశాలన్నీ రుత్ తిప్పంది. మెమోరీ లాస్ తర్వాత.. అతడి ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. ఇప్పుడిప్పుడే అతడికి అన్నీ నెమ్మదిగా గుర్తొస్తున్నాయట. భర్తకు గతం ఎప్పటికైనా గుర్తొస్తోందని ఆశగా ఎదురుచూస్తోంది రుత్.