Srilanka Adani Modi :  శ్రీలంకలో ఓ విండ్ పవర్ ప్రాజెక్ట్ విషయంలో భారత ప్రధాని మోదీ జోక్యం చేసుకుని అదానీకి లభించేలా చేశారన్న ఆరోపణలు కలకలంరేపుతున్నాయి.  శ్రీలంకలో ఈశాన్య ప్రాంతంలోని మనాుర్‌ జిల్లాలో అదానీ గ్రూప్‌ సంస్థకు అక్కడి ప్రభుత్వం విండ్ పవర్  ప్రాజెక్టును కేటాయించింది. ఈ ప్రాజెక్టు కేటాయింపునకుసంబంధించి ప్రభుత్వ సంస్థలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం శుక్రవారం నాడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సిలోన్‌ ఎలక్ట్రిసిటి బోర్డు  ఛైర్మన్‌ ఎంఎంసి ఫెర్డినాండో... దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్షపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'ఒత్తిడి' తీసుకురావడం వల్లే అదానీకి ఈ ప్రాజెక్టును కట్టబెట్టారని వాంగ్మూలం ఇచ్చారు.  సెబ్‌ ఛైర్మన్‌ చేసిన ప్రకటనను అధ్యక్షుడు గొటబాయ ఖండించారు. తరవాత కాసేపటికే సెబ్‌ ఛైర్మన్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.


శ్రీలంకలో ఇంధన ప్రాజెక్టుల కేటాయింపులు ఇదివరకు టెండర్లు పిలిచి పోటీ బిడ్డింగ్‌ ద్వారా జరిగేవి. అదానీ గ్రూపు నేరుగా ప్రవేశించేందుకు అడ్డంకిగా ఉన్న ఈ నిబంధనను శ్రీలంక విద్యుత్‌ చట్టం నుంచి తొలగించి కొద్ది రోజుల కిందటే సవరణలు తీసుకొచ్చారు. ఇంధన ప్రాజెక్టులకు పోటీ బిడ్డింగ్‌ అక్కర్లేదని, నేరుగా కేటాయించవచ్చునని సవరణ చేశారు. దీనిపై ప్రతిపక్ష పార్టీల నుంచి, ప్రభుత్వ విమర్శలకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.  అదానీ గ్రూపు వంటి సంస్థలకుఎర్ర తివాచి పరిచి నేరుగా ఇంధన ప్రాజెక్టులను కట్టబెట్టేందుకే ఈ బిల్లు తెచ్చారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.  


 అదానీ గ్రూపు శ్రీలంక ఇంధన రంగంలోకి ప్రవేశించడంపై కానీ, ఆ వ్యవహారాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యానికి సంబంధించి కానీ ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. ఈశాన్య మన్నార్‌, పూణెర్యాన్‌ జిల్లాల్లో పునరుత్పాధక ఇంధన ప్రాజెక్టులకు సంబంధించి ఈ ఏడాది మార్చిలో అదానీ గ్రూపునకు, సెబ్‌కుమధ్య ఒప్పందం కుదిరింది.  భారత్‌ వ్యాపార దిగ్గజం దొడ్డిదారిన దేశ ఇంధన రంగంలోకి చొరబడుతునాురని విపక్ష నేతలు కొంత కాలంగా ఆరోపణలు  చేస్తున్నారు. 


అదానీ గ్రూపునకు శ్రీలంకలో ఇది రెండో అతిపెద్ద ప్రాజెక్టు. ఇదివరకే అదానీ సంస్థ కొలంబోలో వ్యూహాత్మకమైన పోర్టు టెర్మినల్‌ను చేజిక్కించుకుంది.  ఈ రెండు సందర్భాల్లోనూ అదానీ గ్రూపును భారత ప్రభుత్వం నామినేట్‌ చేసిన సంస్థగానే  శ్రీలంక మంత్రులు పేర్కొన్నారు.  పైగా ఈ రెండింటి ఒప్పందాల్లోనూ పోటీ బిడ్డింగ్‌ లేదు. జఫాు ద్వీపకల్పంలోని మూడు ద్వీపాల్లో హైబ్రిడ్‌ ఇంధన ప్రాజెక్టులను కూడా భారత్‌ నిర్వహిస్తోంది. ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఎడిబి) మద్దతుతో నిర్వహించిన పోటీ బిడ్డింగ్‌లో ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు చైనా దక్కించుకున్నా కూడా శ్రీలంక మాత్రం భారత్‌నే ఎంచుకుంది. అదానీ విషయంలో భారత్‌లో విపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో శ్రీలంకలో వివాదానికి అదానీ కారణం కావడంతో రాజకీయంగానూ చర్చనీయాంశమవుతోంది.