King Charles III Coronation:


అట్టహాసంగా కార్యక్రమం..


బ్రిటన్ కింగ్‌గా ఛార్లెస్ III పట్టాభిషేకం పూర్తైంది. కిరీటం పెట్టి ఆయనను కింగ్‌గా ప్రకటించారు. లండన్‌లోని Westminster Abbeyలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. 1953లో క్వీన్ ఎలిజబెత్‌ను రాణి పట్టాభిషేకం తరవాత మళ్లీ ఇన్నాళ్లకు ఛార్లెస్ III రాజుగా ఎన్నికయ్యాడు. 40వ మోనార్క్‌గా చరిత్ర సృష్టించాడు. సింహాసనంపై ఆయనకు కిరీటం పెట్టి రాజుగా ప్రకటించారు. AFP న్యూస్ ఏజెన్సీ అందించిన వివరాల ప్రకారం...ఆ సింహాసనం 1300-1301 మధ్య కాలంలో తయారు చేయించారు. అప్పటి నుంచి పట్టాభిషేక కార్యక్రమం అందులోనే నిర్వహిస్తున్నారు. శతాబ్దాలుగా స్కాట్‌లాండ్ కింగ్స్‌ అందరూ ఇదే సింహాసనంపై కూర్చుని బాధ్యతలు తీసుకున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో క్వీన్ ఎలిజబెత్ కన్నుమూశారు. తల్లి మరణం తరవాత కొడుకు ఛార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్‌కి (74) వారసత్వంగా ఆ పదవి వచ్చింది. అప్పటికే ఆయన ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌గా ఉన్నారు. క్వీన్ ఎలిజబెత్ II 26 ఏళ్ల వయసులో ఆ బాధ్యతలు చేపట్టారు. ఆమె తండ్రి కింగ్ జార్జ్ VI 1952లో మరణించాక ఆ వారసత్వాన్ని కొనసాగించారు. ఆమె గతేడాది కన్నుమూశారు. ఆమె పెద్ద కొడుకైన ఛార్లెస్ ఫిలిప్‌ను కింగ్‌గా ప్రకటించింది రాయల్ ఫ్యామిలీ. ఇప్పుడు అధికారికంగా పట్టాభిషేకం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారత్ తరపున పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్‌తో పాటు ఆయన సతీమణి డాక్టర్ సుదేష్ ధన్‌కర్ కూడా పాల్గొన్నారు. ఇక బాలీవుడ్‌ ప్రముఖ నటి సోనమ్ కపూర్‌కి కూడా ఈ పట్టాభిషేక కార్యక్రమానికి ఆహ్వానం అందింది.