Kamala Harris Vs Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించడానికి శక్తి మేర పనిచేస్తానని, అందుకోసం డెమోక్రాట్‌లను ఏకం చేస్తానని కమలా హారిస్ ప్రతిజ్ఞ చేశారు. ఆదివారం అకస్మాత్తుగా ప్రెసిడెంట్ రేసు నుంచి తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు జో బైడెన్ ప్రకటించడంతో వైఎస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ డెమోక్రాట్ల తరఫున అభ్యర్థిగా రేసులోకి వచ్చారు. డెమోక్రాట్ అభ్యర్థిగా తనను ప్రకటిచడంపై సంతోషం వ్యక్తం చేసిన కమలా హారిస్, జో బైడెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
బైడెన్ సేవలకు ధన్యవాదాలు
ఈ సందర్భంగా ఆమె ఎక్స్‌లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు. "దేశ అధ్యక్షుడిగా అద్భతమైన సేవలందించిన జో బైడెన్‌కు అమెరికా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దశాబ్దాలు దేశానికి ఆయన అందించిన సేవలకు ధన్యవాదాలు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఆయన అతివాద ప్రాజెక్ట్ 2025 ఓడించడమే లక్ష్యంగా దేశాన్ని ఏకం చేయడమే తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు.
జో బైడెన్ అభ్యర్థిత్వంపై ఇటీవల సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ట్రంప్‌తో జరిగిన చర్చలోనూ జో ఘోరంగా వైఫల్యం చెందడంతో అభ్యర్థిత్వంపై మరోసారి సొంత పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. దాంతోపాటు బైడెన్ (81) వయసు కూడా సహకరించకపోవడం, తీవ్రమైన ఒత్తిడితో అలసిపోయినట్టు కనిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు బైడెన్ ప్రకటించడంతో కమలా హారిస్‌కు మార్గం సుగమం అయ్యింది. కమలా హారిస్ తొలి మహిళా ఉపాధ్యక్షురాలు. మొదటి నల్లజాతి, దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వైస్ ప్రెసిడెంట్ కూడా ఆమే కావడం విశేషం.
కమలా హారిస్‌కు డెమోక్రాట్ల మద్దతు
డెమోక్రాట్ల తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయినప్పటికీ కమలా హారిస్‌కి జో బైడెన్ మద్దతు ఉండటం కలిసొచ్చే అంశం. వచ్చేనెల చికాగోలో జరగనున్న డెమోక్రటిక్ జాతీయ సదస్సులో ప్రతినిధుల ఆమోదం పొందాల్సి ఉంది.
హారిస్‌కు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్‌లు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించారు. భారత సంతతికి చెందిన మరో డెమోక్రాట్ ప్రమీలా జైపాల్ కూడా హారిస్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో ఆగస్టు 19న జరగనున్న ప్రతినిధుల సమావేశంలో తన అభ్యర్థిత్వానికి ఆమోదం లభించడం సులువుగానే కమలా భావిస్తున్నారు.
Also Read:అదిరేటి డ్రెస్ మీరేస్తే - ర్యాంప్ వాక్ చేస్తున్న మోదీ, కిమ్‌ని చూశారా - AI ఫ్యాషన్ షో మాయ
Also Read: ప్రెసిడెంట్ రేసు నుంచి బైడెన్ తప్పుకోడానికి కారణాలివేనా?