Elon Musk's AI Fashion Show: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ వచ్చాక అసాధ్యం అనుకున్నవన్నీ సాధ్యమైపోతున్నాయి. డీప్‌ఫేక్‌తో ఎవరినైనా ఎవరిలాగా అయినా మార్చేయొచ్చని తెలిసింది. ఇది కొంత వరకూ అలజడి సృష్టించినా AI తో క్రియేట్ చేస్తున్న వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నచ్చిన నేతల్ని, హీరోలను, హీరోయిన్‌లతో AI సాయంతో రకరకాల వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇప్పుడో వీడియో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన నేతలు, వ్యక్తులతో ఫ్యాషన్‌ షో చేయించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే...ఈ వీడియోని స్వయంగా ఎలాన్ మస్క్ Xలో పోస్ట్ చేశాడు. AI Fashio Show అని క్యాప్షన్ ఇచ్చాడు. వెంటనే ఇది వైరల్ అయిపోయింది. ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఉన్నారు. వాళ్లు ఫ్యాషన్‌ షో చేస్తే ఎలాంటి డ్రెస్‌లు వేసుకుంటారని ఊహించుకుని అందుకు తగ్గట్టుగా వీడియో ఎడిట్ చేశారు. అందరికీ ఈ డ్రెస్‌లు భలే సూట్ అయ్యాయంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే ఈ వీడియోకి 35 లక్షల వ్యూస్ వచ్చాయి. వందలాది కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. 




దాదాపు నిముషం పాటు ఉన్న ఈ వీడియోలో ప్రధాని మోదీతో పాటు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్, బరాక్ ఒబామా,పోప్ కూడా ఉన్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ గెటప్ అయితే అదిరిపోయింది. అంతే కాదు. జస్టిన్ ట్రూడో, జిన్‌పింగ్, మార్క్ జుకర్‌బర్గ్, బిల్‌ గేట్స్, ఎలాన్ మస్క్‌ కూడా కనిపించారు. జాకెట్ వేసుకున్న పోప్‌ ర్యాంప్ వాక్‌తో మొదలైన ఈ వీడియోలో తరవాత పుతిన్ కనిపించారు. రంగు రంగుల డ్రెస్‌ వేసి ఎడిట్ చేశారు. జో బైడెన్‌పై మాత్రం గట్టి సెటైర్ వేశారు క్రియేటర్స్. ఆయన వీల్‌ఛైర్‌లో ఫ్యాషన్ షో చేస్తున్నట్టు చూపించారు. ఎలాన్ మస్క్ టెస్లా థీమ్‌ ఉన్న సూట్‌లో ర్యాంప్‌ వాక్ చేయగా ప్రధాని నరేంద్ర మోదీ వెరైటీ డ్రెస్‌లో కనిపించారు. చివరలో మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్ బిల్‌గేట్స్ కనిపించారు. ఇటీవల మైక్రోసాఫ్ట్‌ క్రౌడ్ స్ట్రైక్‌ గురించి సెటైరికల్‌గా బిల్‌గేట్స్ చేతిలో ఓ బోర్డ్ పెట్టారు.