Japan Okinotori Shima : ప్రపంచ దేశాల మధ్య సరిహద్దుల కోసం, భూభాగాల కోసం యుద్ధాలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ కేవలం ఒక చిన్న 'రాయి' కోసం ఒక పవర్‌ఫుల్ దేశం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా? అది కూడా నీటిలో మునగకుండా కాపాడటానికి!

Continues below advertisement

జపాన్ దేశం సరిగ్గా ఇదే చేసింది. టోక్యో నుంచి చాలా దూరంలో, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న పగడపు దిబ్బ అయిన ఒకిరో తోరోషిమా కోసం జపాన్ ప్రభుత్వం ఏకంగా 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 

సాధారణంగా ఈ రాయి సైజు కేవలం 60 స్క్వేర్ మీటర్లు మాత్రమే ఉంటుంది. అంటే, మీరు మీ కారు పార్క్ చేసే స్థలం కంటే కొంచెం పెద్దది అంతే. ఇంత చిన్న రాయి నీటిలో మునిగిపోకుండా కాపాడటానికి ఒక పెద్ద దేశం ఎందుకు అంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ నియమాలు, సముద్రపు నీటిపై హక్కుల రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Continues below advertisement

సముద్రపు హక్కుల్లో కీలకం ఆ 370 కిలోమీటర్లు

ఒక దేశం సముద్రంపై ఎంతవరకు హక్కు కలిగి ఉండాలి అనేదానికి అంతర్జాతీయ చట్టాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ రూల్ ప్రకారం, ఒక దేశానికి ఆ దేశపు సరిహద్దు నుంచి 370 కిలోమీటర్ల వరకు సముద్రంపై పూర్తి హక్కు ఉంటుంది.

ఈ 370 కిలోమీటర్ల పరిధిని ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని అంటారు. ఈ డిస్టెన్స్‌లో ఎలాంటి వస్తువులు దొరికినా, లేదా ఏ సహజ వనరులు ఉన్నా, వాటిపై పూర్తి హక్కు ఆ దేశానికి మాత్రమే చెందుతుంది. చమురు, గ్యాస్, చేపలు లేదా ఇతర ఖనిజ సంపద అయినా, ఆ దేశం మాత్రమే వాడుకోగలదు.

జపాన్‌కు ఒకిరో తోరోషిమా ఎందుకు ముఖ్యం?

జపాన్ నుంచి చాలా దూరంలో ఉన్న ఒకిరో తోరోషిమా విషయంలోనూ ఇదే నియమం వర్తిస్తుంది. కానీ దీని ప్రత్యేకత ఏమిటంటే, ఈ రాయి జపాన్ కంట్రోల్‌లోకి వస్తుంది కాబట్టి, వారికి ఆ 370 కిలోమీటర్ల డిస్టెన్స్ ఈ రాయి నుంచే కాలిక్యులేట్ అవుతుంది.

మీకు సులువుగా అర్థం కావాలంటే, ఒక ఉదాహరణ చూద్దాం. మన భారతదేశం విషయంలో చూస్తే, మనకు లక్షద్వీప్ వంటి దీవులు ఉన్నాయి కదా? ఈ దీవులు మన దేశపు ప్రధాన భూభాగం నుంచి దూరంగా ఉన్నప్పటికీ, ఆ 370 కిలోమీటర్ల హక్కులు ఆ దీవుల సరిహద్దుల నుంచే మొదలవుతాయి.

అదే విధంగా, ఒకిరో తోరోషిమా జపాన్‌కు చాలా కీలకమైన కేంద్ర బిందువు. ఈ చిన్న రాయిని బేస్‌గా చేసుకుని, జపాన్ మిలియన్ల కొద్దీ చదరపు కిలోమీటర్ల సముద్ర ప్రాంతంపై తమ హక్కులను ప్రకటించుకోగలుగుతోంది.

ఒకవేళ రాయి మునిగిపోతే?

ఇక్కడ అసలు సమస్య ఉంది. ఒకిరో తోరోషిమా ఒక చిన్న రాయి మాత్రమే. అది పెద్ద తుఫానులు, అలల ఉధృతికి మునిగిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది.

అంతర్జాతీయ నియమం ప్రకారం, ఈ రాయిగాని సముద్రంలో పూర్తిగా మునిగిపోతే, అప్పుడు జపాన్‌కు ఆ రాయి నుంచి 370 కిలోమీటర్ల హక్కు లభించదు. దానికి బదులుగా, వారికి హక్కులు కేవలం వారి దేశపు ప్రధాన భూభాగం సరిహద్దు నుంచి 370 కిలోమీటర్ల వరకు మాత్రమే స్టార్ట్ అవుతాయి. దీని వల్ల జపాన్ తమ EEZ పరిధిలో ఉన్న పెద్ద మొత్తంలో సముద్ర ప్రాంతాన్ని కోల్పోతుంది. అక్కడి సహజ వనరులపై తమ హక్కులను కోల్పోతుంది. చైనా వంటి పొరుగు దేశాలు ఈ ప్రాంతంపై దృష్టి సారించే అవకాశం ఉంది.

ఈ ప్రమాదాన్ని నివారించడానికే జపాన్ ప్రభుత్వం ఆ చిన్న రాయిని నీటిలో మునిగిపోకుండా కాపాడటానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. జపాన్ ఈ ప్రాంతాన్ని బలంగా కాపాడుకోవడానికి, దానికి చుట్టూ కాంక్రీట్, పటిష్టమైన నిర్మాణాలు నిర్మించి, నీటిలో మునగకుండా చర్యలు తీసుకుంటుంది.

4,500 కోట్ల వ్యయం: రాయి, లేదా అంతర్జాతీయ హక్కు?

ఈ మొత్తం ఖర్చు కేవలం రాయిని కాపాడటానికి కాదు, తమ సముద్ర సరిహద్దు హక్కులను కాపాడుకోవడానికి చేస్తున్న వ్యయం. సముద్రంలో ఈ రాయి ఉనికిని నిలబెట్టుకోవడం ద్వారా, జపాన్ తమ EEZ ను కాపాడుకుంటోంది, ఇది చట్టబద్ధంగా వారికి గొప్ప ప్రయోజనాన్ని అందిస్తుంది.

ఒకిరో తోరోషిమా ఒకే ఒక విషయాన్ని తెలియజేస్తుంది అంతర్జాతీయ భూభాగం,  వనరుల హక్కుల విషయంలో, ఒక్క చిన్న రాయి కూడా కొన్ని వేల కోట్ల రూపాయల విలువైనదిగా మారుతుంది. ఇది కేవలం భౌగోళిక అంశం మాత్రమే కాదు, ఒక శక్తివంతమైన దేశం తమ ఆర్థిక ప్రయోజనాలను, అంతర్జాతీయ హోదాను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం. ఆ 60 స్క్వేర్ మీటర్ల రాయి జపాన్ ఆర్థిక భవిష్యత్తుకు కీలకమైన భద్రతను అందిస్తోందని చెప్పవచ్చు.