Flying Drone Viral Video :   డ్రోన్లతో ఇప్పుడు చాలా పనులు చేస్తున్నారు. కానీ మనుషులు డ్రోన్లను కార్లలాగా వాడుకోవచ్చా అనే ఆలోచన చాలా తక్కువ మందికి వచ్చి ఉంటుంది. అలా వచ్చిన వారిలో పరిశోధన చేసి మరీ మనుషులు ప్రయాణించే డ్రోన్ తయారు చేసినవారు ఒక్కరున్నారు. హంటర్ కోవాల్డ్ అనే న్యూయార్క్ యువకుడు ఈ డ్రోన్ తయారు చేశాడు. దీనికి ది స్కై సర్ఫర్ అని పేరు పెట్టాడు. అంతే కాదు ఇప్పుడు ఈ స్కైసర్ఫర్ మీద న్యూయార్క్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. ఈ వీడియోను తీసిన కొంత మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయిపోయింది. 






మనకు నచ్చిన దుస్తులతో డిజిటల్ అవతార్, కొత్త ఫీచర్‌ని తీసుకొస్తున్న మెటా సంస్థ


హంటలర్ కోవాల్డ్ చిన్న తనం నుంచి ఎగిరే వస్తువులపై ఆసక్తి చూపేవాడు. అతని తండ్రికి పైలట్ లైసెన్స్ ఉండటంతో ఎక్కువగా తండ్రితో పాటు విమాానాల్లో తిరిగేవాడు. ఆ ఆసక్తి పెరిగి తనతో పాటే పెద్దయింది. పాతికేళ్లు వచ్చే సరికి స్కైసర్ఫర్లను తయారుచేసేశాడు.


 





ఒకప్పుడు టీవీ యాంకర్, ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ సెల్లర్, అప్ఘనిస్థాన్ లో ఆర్థిక సంక్షోభానికి నిదర్శనం! 


ఈ ఐడియా కార్లకు పెద్ద గండమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సులువుగా తక్కువ ఎత్తుల అలా ఎగిరిపోవడానికి  యువత అలవాటు పడితే ఇక కార్లను పట్టించుకోరని అంటున్నారు.పైగా ఈ  స్కైసర్ఫర్లకు కావాల్సింది పెట్రోల్ డీజిల్ కూాడా కాదు. అందుకే ఇవి వచ్చే జనరేషన్‌కు ఫస్ట్ చాయిస్ అవుతాయని అభిప్రాయపడుతున్నారు. హంటర్  కు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. త్వరలోనే ఓ బడా కంపెనీతో ఒప్పందం చేసుకుని వాటిని బయటకు తీసుకు రావొచ్చని భావిస్తున్నారు. ఒక్క సారి వాటికి అనుమతులన్నీ వచ్చేస్తే.. ప్రపంచం మొత్తాన్ని అవి చుట్టేయడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. 


అమెరికాకు ఏమైంది ? ఆర్థికంగా కుప్ప కూలిపోతోందా ?