American economy in danger: అమెరికాలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్‌లపై వడ్డీ రేట్లను భారీగా పెంచింది. దాదాపు 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వడ్డీ రేట్లను పెంచారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసేందుకు రుణ రేటు బెంచ్‌మార్క్‌ను 0.75 శాతం పాయింట్లు పెంచింది. 1994 నవంబర్ అనంతరం మొదటి సారి 75 బేస్ పాయింట్ల పెరుగుదల నమోదు కావడంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. చాాలా రోజులుగా నిరుద్యోగం రేటు 3 పాయింట్ ఆరు శాతంగా కొనసాగుతోంది. క్రెడిట్ కార్డులను విరివిగా వాడే అమెరికన్ల వద్ద ఇప్పుడు చెల్లింపులకు డబ్బులు లేవు.
భారీగా వడ్డీ రేట్లు పెంచిన ఫెడరల్ రిజర్వ్
అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆర్థిక వెత్తలు అంచనా వేస్తున్నారు. అన్ని రంగాలు కుదేలై ప్రభుత్వ ఖజానాకు నిధులు అందడం లేదు. త్వరలో స్టాక్ మార్కెట్లు పతనమై 40 శాతం దిగువకు వస్తాయన్న విశ్లేషణలువస్తున్నాయి. 70 శాతం మంది అమెరికన్లు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి లాభాల కోసం వేచి చూడటం అలవాటుగా వస్తోంది. ఇప్పుడు మాత్రం వారిలో భయాలు నెలకొన్నాయి. బుల్ మార్కెట్ కాస్త..
వచ్చే ఏడాది ప్రారంభంలోనే చుట్టుముట్టనున్న మాంద్యం
ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ఒక సర్వే నిర్వహించింది. దాని ప్రకారం 2023 ప్రథమార్థంలో ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందని 70 శాతం మంది తమ అభిప్రాయంగా చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెకెండ్ క్వార్టర్ లో అమెరికా ఆర్థిక వృద్ధి రేటు 1.5 శాతం నుంచి సున్నా పాయింట్ తొమ్మిది శాతానికి పడిపోతుందని తేల్చారు. అంటే మాంద్యానికి సంకేతాలు ఇప్పుడే అందుతున్నాయని అంచనా వేయవచ్చు. ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం 8 పాయింట్ ఆరు శాతానికి చేరుకుంది. ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికాలో ఆర్థికమాంద్యం ఎక్కువ రోజులే ఉంటుంది..
భారీగాపెరిగిపోతున్న ఆహార పదార్థాల ధరలు
అమెరికాలో జనం ఎక్కువగా తినే ఏడు ఆహార పదార్థాల ధరలు 25 నుంచి 30 శాతం పెరిగాయి. దానితో జనం జేబులకు చిల్లులు పడుతున్నాయి. రష్యాతో డీలింగ్ ఉన్న కంపెనీలు ఎగుమతి, దిగుమతలను ఆపెయ్యడం వల్ల కార్పొరేట్ లాభాలు తగ్గిపోయాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే కార్పొరేట్ కంపెనీల పన్నుల చెల్లింపులు కూడా అంతంతమాత్రమే అవుతున్నాయి. దానితో ఆమెరికా ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదని చెబుతున్నారు. .