Israel Strike Syria: సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్, అలెప్పోలో బాంబులు వర్షం 

Israel Strike Syria: సిరియాను టార్గెట్ చేసుకున్న ఇడ్రాయెల్‌ బాంబు వర్షం కురిపిస్తోంది. గత కొన్ని రోజులుగా గ్యాప్ లేకుండా వైమానిక దాడులు చేస్తోంది. 

Continues below advertisement

Israel Strike Syria: గురువారం (జనవరి 2) రాత్రి సిరియాలోని అలెప్పో నగరానికి దక్షిణ భాగంలో ఉన్న సిరియన్ ఆర్మీ స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడింది. సిరియన్ మీడియా నివేదికల ప్రకారం, అల్-సఫీరా నగరానికి సమీపంలో ఉన్న రక్షణ కేంద్రం, శాస్త్రీయ పరిశోధనా కేంద్రాన్ని ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. బషర్ అల్-అస్సాద్ పతనం తర్వాత సిరియా లోపల ఇజ్రాయెల్ దాడులు తీవ్రత పెరిగింది. 

Continues below advertisement

సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ నివేదిక ప్రకారం, సిరియాలోని అలెప్పో దక్షిణంగా ఉన్న రక్షణ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడి టైంలో 7 పెద్ద పేలుళ్లు వినిపించాయి. అయితే ఈ దాడుల్లో ప్రాణనష్టం గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. ఈ దాడులు చాలా తీవ్రంగా ఉన్నాయని, భూమి కంపించిందని, ఇళ్ల తలుపులు, కిటికీలు షేక్ అయ్యాయని అల్-సఫీరా ప్రాంతంలోని ప్రజలు చెప్పినట్టు AFP పేర్కొంది.

"ఇది నేను చూసిన అత్యంత భయంకరమైన దాడి, అప్పటి వరకు చీకటిగా ఉన్న ప్రాంతంలో వెలుగుతురు వచ్చింది." అని స్థానిక నివాసి ఒకరు దాడి తీవ్రత గురించి వివరించారు. గత నెల ప్రారంభంలో ఇస్లామిక్ తిరుగుబాటుదారులు బషర్ అల్-అస్సాద్ పాలనను పడగొట్టినప్పటి నుంచి సిరియాపై ఇజ్రాయెల్ నిరంతరాయంగా వైమానిక దాడులు చేస్తోంది.

ఇజ్రాయెల్ గత కొన్ని వారాల్లో సిరియన్ నేవీపై దాడులతో విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకు 500లకుపైగా వైమానిక దాడులు చేసింది. ఇది కాకుండా ఇజ్రాయెల్ గోలన్ హైట్స్ సమీపంలో ఉన్న బఫర్ జోన్‌పై నియంత్రణ పెట్టింది. కొన్ని నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్ దళాలు డమాస్కస్ నుంచి 20 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే కనిపించాయి.

ఇజ్రాయెల్ దాడులు హిజ్బుల్లా, ఇతర అనుకూల సిరియన్ గ్రూపులకు భారీ నష్టాన్ని మిగులుస్తోంది. ఇజ్రాయెల్ నిరంతర దాడులతో సిరియాలో అస్థిరత మరింత పెంచాయి. ఈ ప్రాంతంలో పరిస్థితులను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. 

Also Read: మారిపోతోంది.. అంతా మారిపోతోంది - ఆడోళ్లను, మగోళ్లను ఇక రోబోలే సుఖపెడతాయట !

Continues below advertisement