Robots are romance partners: మారిపోతోంది.. అంతా మారిపోతోంది - ఆడోళ్లను, మగోళ్లను ఇక రోబోలే సుఖపెడతాయట !

Robot Romance: ఆడామగ శృంగార అవసరాలన్నీ రోబోలే తీరుస్తాయని ప్యూచరిస్టులు చెబుతున్నాయి. లండన్‌కు చెందిన ఓ పెద్దాయన పరిశోధన చేసి వెల్లడించిన విషయాలు రాబోయే రోజుల్లో పెనుమార్పులు సూచిస్తున్నాయి.

Continues below advertisement

Futurists say that all the sexual needs of men will be fulfilled by robots: అప్పుడెప్పుడో తెలుగులో ఘటోత్కచుడు అనే సినిమాలో ఎస్వీ కృష్ణారెడ్డి రోబోట్‌తో రోజా లవ్ స్టోరీని చూపిస్తే కాస్త అతి అనుకున్నారు. కానీ ఇప్పుడు అంతా నిజమవుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. ఎలాన్ మస్క్ ఇటీవల వి.రోబోట్ పేరుతో రోబోల్ని రిలీజ్ చేశాడు. ప్రపంచంలో మనుషులు తగ్గిపోతున్నారు కాబట్టి వారు చేసే పనుల్ని రోబోలు చేసేలా భవిష్యత్ తరాల కోసం వీటిని సిద్దం చేస్తున్నట్లుగా ఆయన చెప్పారుు. ఎలాన్ మస్క్ ఇలా రెడీ చేయక ముందే కొంత మంది ప్యూచరిస్టులు పరిశోధనలు చేసి కొన్ని కీలక విషయాలు కనిపెట్టారు. అవేమిటంటే.. వచ్చే పాతికేళ్లు మనుషులు, మనుషుల మధ్య శృంగార బంధాలు ఉంటే అదో పెద్ద వింతలా చూస్తారట. నీ రోబో ఎంత పవర్ ఫుల్.. నీ రోబోకు ఎంత సామర్థ్యం ఉందని ఆడవాళ్లు, మగవాళ్లు కలిసినప్పుడు కబుర్లు చెప్పుకుని ముసి ముసి నవ్వులు నవ్వుకునే సందర్భం వచ్చేస్తుందట.  

Continues below advertisement

శృంగారం కోసం రోబోల మీదే ఆధారపడనున్న తర్వాత తరం 

2050 నాటికి శృంగారం కోసం మనుషులు ఎక్కువగా భాగస్వామిపై ఆధారపడటం పూర్తిగా తగ్గిస్తారట. ముఖ్యంగా ముహిళలు మగవాళ్లపై ఆధారపడటం కన్నా రోబోలను కొనుక్ుకంటారట. వాటితోనే మానసికంగా ప్రేమలో పడి.. వాటితోనే అన్ని పనులు చేసేస్తారని అంటున్నారు.  డాక్టర్ ఇయాన్ పియర్సన్ ఫ్యూచరాలజిస్ట్ లండన్‌లో చాలా కాలం పరిశోధనలు చేసి ఎంతో ముందుకాలానికి వెళ్లి ఆలోచించి కొన్ని విషయాలు వెల్లడించారు. ఇవి వైరల్ గా మారుతున్నాయి. పురుషులు మహిళా రోబోలతో అంత త్వరగా సర్దుకుపోలేరు కానీ మహిళలు మాత్రం చాలా వేగంగా ఆకర్షితులవుతారని అంటున్నారు. 

రోబోలను రెడీ చేస్తున్న ఎలాన్ మస్క్ 

ఈ ఫ్యూచరాలజిస్టు చెప్పిన అంశాలపై చాలా మంది విమర్శలు గుప్పించారు. అయితే దానికీ ఆయన కౌంటర్ ఇచ్చారు. గతంలో వైబ్రేటర్ల గురించి మాట్లాడటం మహాపాపం అనేవారని ఇప్పుడు మహిళా మ్యాగజైన్లు వాటి గురించి ప్రత్యేకంగా కథనాలు రాస్తున్నాయని గుర్తు చేశారు. అందుకే తాను చెప్పేది ఖచ్చితంగా నిజమవుతుందని అంటున్నారు.  రోబోలతో శృంగారం గురించి మొదట్లో చాలా మందికి అభ్యంతరాలు ఉంటాయని అది సహజంగానే ఉండే విషయమేనన్నారు. కానీ క్రమంగా వాటికి అలవాటు పడే కొద్దీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , యాంత్రిక ప్రవర్తన, వారి ఫీలింగ్ మెరుగుపడటం, బలమైన భావోద్వేగ బంధాలతో స్నేహం చేయడం ప్రారంభించడంతో  అందరూ ఆమోదిస్తారని ఆయన అంటున్నారు.  

ఇప్పటికే సెక్స్ డాల్స్‌కు విదేశాల్లో భారీ గిరాకీ 

రోబోతో ప్రేమలో పడటాన్నిఈ ఫ్యూచరాలజిస్టు  రోబోఫిలియా అని పేరు పెట్టారు. తాను చెప్పేది కామెడీ అని అనుకునేవారు.. డేవిడ్ మిల్స్  అనే వ్యక్తి జీవితాన్ని పరిశీలించాలని అంటున్నారు. విడాకులు తీసుకున్న ఆయన ఓ సెక్స్ డాల్‌తో గడిపేస్తున్నాడు. పైగా  రెండేళ్లుగా ఆమెతో రిలేషన్ షిప్ లో ఉన్నానని, టాఫీ లేకుండా నేను ఎన్నడూ అనుభవించని లైంగిక అనుభవాలు దక్కాయని ఆయన అంటున్నారు. సెక్స్ డాల్స్ కు  ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో  డిమాండ్ పెరుగుతోంది. వాటిని తయారు చేసే సంస్థలు పెరుగుతున్నాయి. అందుకే ఈ ఫ్యూచరాలజిస్టు పెద్దాయన చెప్పేది ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఎలాన్ మస్క్ రోబోలను మార్కెట్లోకి తెచ్చిన తర్వాత ఇది నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. 

Continues below advertisement