Israel Gaza Attack: 


మాస్టర్ మైండ్ మహమ్మద్ దెయిఫ్..


ప్రపంచంలోనే మెరుగైన ఇంటిలిజెన్స్ సిస్టమ్ ఉన్న దేశాల్లో ఇజ్రాయేల్ ఒకటి. దాదాపు మూడంచెల నిఘా వ్యవస్థ ఉంది ఆ దేశానికి. కానీ..ఆ అన్ని అంచెల్ని దాటుకుని మరీ ఊహించని విధంగా మెరుపుదాడులు (Hamas Attacks) చేశారు హమాస్ ఉగ్రవాదులు. ఇది ఇజ్రాయేల్‌ని షాక్‌కి గురి చేసింది. ఇంటిలిజెన్స్ ఫెయిల్యూర్ కారణంగానే ఈ స్థాయిలో విధ్వంసం ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇప్పటికే ఎక్స్‌పర్ట్‌లు తేల్చి చెబుతున్నారు. ఇంటిలిజెన్స్ హెచ్చరించినా ప్రధాని నెతన్యాహు పట్టించుకోలేదన్న వాదనలూ మరో వైపు వినిపిస్తున్నాయి. అసలు ఇంత పక్కాగా హమాస్ ఉగ్రవాదులు ఎలా దాడి చేయగలిగారు అన్న ఆశ్చర్యమూ వ్యక్తమవుతోంది. అయితే....ఈ అటాక్స్‌ వెనక ఓ మాస్టర్‌ మైండ్ ఉన్నాడు. అతడి పేరే మహమ్మద్ దెయిఫ్ (Mohammed Deif). ఈ ఆపరేషన్‌కి  Al Aqsa Flood అని పేరు కూడా పెట్టాడు. దాదాపు రెండేళ్లుగా ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు మహమ్మద్ దెయిఫ్. ఈ పగకీ ఓ కారణముంది. రెండేళ్ల క్రితం 2021 మే నెలలో ఇజ్రాయేల్‌ జెరూసలేంలోని  Al Aqsa మసీదుపై రంజాన్ మాసంలో దాడి చేసింది. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అందరినీ బయటకు లాగేసింది. ఆ సమయంలో హమాస్ ఉగ్రవాదులకు, ఇజ్రాయేల్‌ సైన్యానికి దాదాపు 11 రోజుల పాటు యుద్ధం జరిగింది. అప్పటి నుంచి ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్నాడు మహమ్మద్ దెయిఫ్. కానీ...హమాస్‌ ఆగ్రహానికి ఇదొక్కటే కారణం కాదు. 1973 నుంచే అరబ్ దేశాలకు, ఇజ్రాయేల్‌కి యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే గాజాపై యుద్ధం ప్రకటించింది ఇజ్రాయేల్. ఇప్పుడు హమాస్ దాడులతో మరోసారి వార్ డిక్లేర్ చేసింది. 2021లో జెరూసలేం మసీదుపై దాడులు జరిగిన సమయంలో ప్రాణాలతో బయటపడ్డాడు పాలస్తీనా మిలిటెంట్ మహమ్మద్ దెయిఫ్. 


టన్నెల్‌లో దాక్కున్నాడా..? 


ఈ దాడుల తరవాత మహమ్మద్ దెయిఫ్ ఫొటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. అయితే..ప్రస్తుతం మహమ్మద్ ఎక్కడున్నాడన్నది మాత్రం రహస్యంగానే ఉంది. గాజాలోనే ఎక్కడో ఓ టన్నెల్‌లో దాక్కుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడుల వెనక కచ్చితంగా మహమ్మద్ దెయిఫ్ హస్తం ఉందని ఇడ్రాయేల్ సెక్యూరిటీ కూడా ప్రకటించింది. గాజాలో ఇజ్రాయేల్‌ చేసిన దాడుల్లో దెయిఫ్ కుటుంబ సభ్యులు చనిపోయారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గాజాలోని హమాస్ లీడర్ యెహ్యా సిన్వర్ (Yehya Sinwar)తో కలిసి ఈ అటాక్స్‌కి ప్లాన్ చేశాడు దెయిఫ్. హమాస్ ఉగ్రవాదులకు ఇరాన్‌ పెద్ద ఎత్తున సాయం అందిస్తోందన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. అమెరికా కూడా ఇదే అనుమానం వ్యక్తం చేసింది. అయితే..ఇరాన్‌ భద్రతా అధికారులు మాత్రం ఈ దాడుల్లో తమ హస్తం లేదని తేల్చి చెబుతున్నారు. దాదాపు రెండేళ్ల పాటు మాటు వేసి గట్టిగానే దాడులు చేశారు హమాస్ ఉగ్రవాదులు. ఇజ్రాయేల్ సైన్యం తిప్పి కొడుతున్నప్పటికీ...గాజా వద్ద భారీగానే నష్టం వాటిల్లింది. ప్రస్తుతానికి గాజాపై పట్టు సాధించామని ఇజ్రాయేల్ ప్రకటించింది. 


Also Read: పాలస్తీనాని అమెరికా పట్టించుకోలేదు, అందుకే ఈ యుద్ధం - పుతిన్ అసహనం