Iran-Israel Conflict: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం ప్రపంచ దేశాలను ప్రభావితం చేయనుంది. ఇదివరకే దౌత్యపరమైన ప్రకటనలు ఊపందుకున్నాయి. పశ్చిమ ఆసియాలో హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్న సమయంలో, ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌ను నియంత్రించే బాధ్యతను అమెరికాకు అప్పగించాలని చూస్తోంది. అమెరికా నిజంగా ఈ యుద్ధాన్ని ఆపాలనుకుంటే, ఇప్పుడు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఇరాన్ నాయకులు సూచించారు. .

ఒకే కాల్‌తో నెతన్యాహును శాంతింపజేయవచ్చుఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి సోమవారం X లో ఒక పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు- "వాషింగ్టన్ (డొనాల్డ్ ట్రంప్) నుండి ఒక్క ఫోన్ కాల్ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహును శాంతింపజేయడానికి సరిపోతుంది." ఈ ఒక్క ఫోన్ కాల్ ఘర్షణను ఆపడమే కాకుండా, దౌత్యపరమైన చర్చలకు రావడానికి మార్గం సుగమం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్ ఆగకపోతే, ప్రతిదాడులు కొనసాగుతాయిఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరుదేశాలను శాంతించాలని సూచించారు. ఇదివరకే తాను భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నిలిపివేశానని.. దౌత్యంపై నమ్మకం ఉంచి, కాల్పుల విరమణకు రావాలన్నారు. ఇజ్రాయెల్ కనుక జాగ్రత్తగా వ్యవహరించకపోతే, ఇరాన్ తదుపరి చర్యలు తీసుకోవాలని అరాఘ్చి అన్నారు. ఇజ్రాయెల్ దూకుడు తగ్గించకపోతే కనుక ఇరాన్ ప్రతిదాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వెనక్కి తగ్గితే ఇరు దేశాలకు మంచిదని హితవు పలికారు.

పలు దేశాలకు ఇరాన్ విజ్ఞప్తి

తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించేలా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇరాన్ కోరింది. జోక్యం చేసుకుని ఉద్రిక్తతలకు స్వస్తి పలికేలా చూడాలని ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ దేశాలను ఇరాన్ కోరింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఇరాన్, మూడు గల్ఫ్ ప్రాంతాల నుండి వచ్చిన ఇద్దరు అధికారులు, కాల్పుల విరమణ దిశగా నిర్ణయం తీసుకుంటే.. అణు చర్చలలో సడలింపు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. ట్రంప్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే కనుక ఇజ్రాయెల్ సైలెంట్ అయిపోతుందని ఇరాన్ అధినేత దీమాగా ఉన్నారు.

టెహ్రాన్ నగరాన్ని వీడండి.. ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలుడొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో కఠిన వైఖరిలో ట్రూత్ సోషల్ లో ఇలా పోస్ట్ చేశారు. "గతంలో నేను కోరినప్పుడే ఇరాన్ ఆ అణు ఒప్పందంపై సంతకం చేసి ఉండాలి. ఇది నిజంగా సిగ్గుచేటు. దీని వల్ల మానవాళికి భారీ నష్టం వాటిల్లుతోంది. ఏ పరిస్థితుల్లోనూ ఇరాన్ అణ్వస్త్రాలను పొందకూడదు" అని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు ప్రతి ఒక్కరూ వెంటనే టెహ్రాన్ నగరాన్ని వదిలి వెళ్లాలని అన్ని దేశాలకు చెందిన వారిని ట్రంప్ హెచ్చరించారు.