Canada: కెనడా ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రూబీ ధల్లా - బ్యాక్‌గ్రౌండ్ పవర్ ఫుల్ !
Canada Prime Minister Race: భారత సంతతికి చెందిన కెనడియన్ రాజకీయ నాయకురాలు రూబీ ధల్లా ప్రధానమంత్రి రేసులోకి వచ్చారు. లిబరల్ పార్టీ నాయకత్వం కోసం ఆమె పోటీ పడుతున్నారు.
Indian Origin Ruby Dhalla On Race For Canada Next Prime Minister: కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడో రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ప్రదానమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ సాగుతోంది. పలువురు పేర్లు ప్రచారంలోకి వస్తాయి. తాజాగా భారత సంతతికి చెందిన కెనడియన్ రాజకీయ నాయకురాలు రూబీ ధల్లా లిబరల్ పార్టీ నాయకత్వం కోసం పోటీ లోకి వచ్చారు. ఆమె ఈ పోటీలో ముందడుగు వేస్తే కెనడాకు మొదటి సారి శ్వేత జాతీయేతర నేత ప్రదాని అవుతారు. రూబీ దల్లా, వైద్యురాలు. విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. మూడు సార్లు పార్లమెంట్ సభ్యురాలిగా గెలిచారు. సవాళ్లను ఎదుర్కొని కెనడాను సమర్థంగా ముందుకు తీసుకెళ్లగల సామర్థ్యం తనకు ఉందని రూబీ దల్లా చెబుతున్నారు.
తన ప్రాధన్యతలుగా పెరుగుతున్న గృహ ఖర్చు, పెరుగుతున్న నేరాల రేట్లు, పెరుగుతున్న ఆహార ధరలు , US సుంకాల ముప్పు వంటి వాటిని గుర్తించారు. కెనడా ఎదుర్కొంటున్న సుంకాల ముప్పులను చాలా తీవ్రమైనదని ఆమె భావిస్తున్నారు. ఇది కెనడా కార్మికులు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని.. తక్షణం ఆ సమస్య నుంచి కెనడానికి బయటపడేయాల్సి ఉందని అంటున్నారు. కెనడాలో విన్నిపెగ్‌లో రూబీ దల్లా జన్మించారు. ఆమె తల్లిదండ్రులు భారతీయ మూలాలున్నవారు. కెనడాలో ఎలా ఉన్నతమైనదో తనకు వచ్చిన అవకాశాలే చూపిస్తాయని ఆమె అంటారు. 1970లలో వలసదారులకు కెనడా తలుపులు తెరిచినందుకు ప్రస్తుత ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తండ్రి పియరీ ట్రూడోకు ఆమె కృతజ్ఞతలు కూడా చెబుతూంటారు.
1972లో తన తల్లి కెనడాకు వచ్చిందని రూబీ దల్లా చెబుతారు. కెనడాలో పుట్టి పెరిగిన రూబీ దల్లా పధ్నాలుగేళ్ల వయసు నుంచే లిబరల్ పార్టీతో కలిసి పని చేస్తున్నారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు మూడు సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికై సమర్థమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'కెనడా పునరాగమనం ఇప్పుడే ప్రారంభమవుతుంది' అనే నినాదాన్ని ఆమె వినిపిస్తున్నారు. తన అంతర్జాతీయ అనుభవంతో, ప్రపంచ వేదికపై కెనడా ఖ్యాతిని పెంచుతానని ఆమె హామీ ఇస్తున్నారు. ఇతర దేశాలతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ట్రూడో ఇతర దేశాలతో పెట్టుకున్న కయ్యాల గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ..తాను అలాంటి పని చేయనని అంటున్నారు.
కెనడా ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపిక ప్రక్రియ సుదీర్ఘ ప్రక్రియ. ప్రస్తుతం రూబీ దల్లా రేసులోకి వచ్చారు. ఆమెకు మద్దతు లభిస్తే చరిత్ర సృష్టిస్తారు.