DeepSeek AI: చైనా ‘డీప్​సీక్’​ సంచలనం, అమెరికా ఏఐ ఇండస్ట్రీ సైతం బెంబేలు- అసలేంటీ ‘డీప్​సీక్’?​

చైనాకు చెందిన ‘డీప్​సీక్’ స్టార్టప్​ సంస్థ సంచలనం సృష్టించింది. ఈ ఏఐ అసిస్టెంట్ చాట్​జీపీటీని ఓవర్​టేక్​ చేసి అమెరికాలోని యాపిల్ యాప్ స్టోర్​లో టాప్​లో నిలిచింది.

Continues below advertisement

DeepSeek AI: చైనాకు చెందిన ‘డీప్​సీక్’ (DeepSeek) స్టార్టప్​ సంస్థ సంచలనం సృష్టించింది. తక్కువ ఖర్చుతో హై ఎఫీషియెన్సీ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ (Artificial intelligence) మోడల్​ని ప్రపంచానికి పరిచయం చేసింది. అదిమాత్రమే కదా.. ఏకంగా చాట్​జీపీటీని అధిగమించింది. ఈ ఏఐ అసిస్టెంట్ ఇప్పుడు చాట్​జీపీటీని ఓవర్​టేక్​ చేసి అమెరికాలోని యాపిల్ యాప్ స్టోర్​లో టాప్​లో నిలిచింది. ఇప్పుడు ఈ డీప్​సీక్​తో ప్రపంచ దేశాల్లోని లీడింగ్​ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ కంపెనీలు హడలెత్తిపోతున్నాయి. ముఖ్యంగా అమెరికాలోని దిగ్గజ టెక్​ కంపెనీల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.

Continues below advertisement

అసలేంటి ఈ డీప్​సీక్​?
ఏఐ, క్వాంటిటేటివ్ ఫైనాన్స్​లో సిద్ధహస్తుడైన చైనా ఇంజినీర్, ఎంటర్​ప్రెన్యూర్ లియాంగ్ వెన్​ఫెంగ్ 2023లో ఈ డీప్​సీక్​ని స్థాపించారు. ఈ ఏఐ మోడల్​ని డీప్​సీక్​ ఆర్​1 అని నామకరణం చేశాడు. డీప్​సీక్ సృష్టించడానికి ముందు ఆయన దేశంలో ఆర్థిక డేటాను విశ్లేషించడానికి ఏఐని ఉపయోగించే హెడ్జ్ ఫండ్ సంస్థకు నాయకత్వం వహించారు. ఈ కంపెనీ ఓపెన్​సోర్స్​ ఏఐ మోడల్స్​ని డెవలప్​ చేసి, వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్స్​కి అందజేసింది. వారు తమ టెక్నాలజీని మెరుగుపరుచుకునేందుకు డీప్​సీక్​ ఆర్1​ని వాడుకుంటున్నారు.​

అదే ముఖ్యమైన తేడా..
డీప్​సీక్​ సంచలనంగా మారడంతో దానిని ఇప్పుడు ఓపెన్​ఏఐకి చెందిన చాట్​జీపీటీతో పాటు ఇతర ఏఐ మోడల్స్​తో పోల్చుతున్నారు. ఏఐ మోడల్స్​ని తీసుకొచ్చేందుకు పలు సంస్థలు బిలియన్​ డాలర్లు ఖర్చు చేస్తుంటే.. వాటిల్లో సగం కూడా ఖర్చు చేయకుండానే ఏఐ మోడల్స్​ని తీసుకొచ్చింది డీప్​సీక్​. ప్రాంప్ట్​కి సమాధానం ఇచ్చే ముందు అందుకు కారణాలు కూడా చెబుతుంది. తక్కువ ఖర్చుతో రూపొందడం, అంశాలను విష్లేషించడమే డీప్​సీక్​ ఆర్​1కి, ఇతర మోడల్స్​కి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం. సక్సెస్​ఫుల్​ ఓపెన్​ఏఐ టెక్నాలజీతో ఇది సమానంగా పనిచేస్తుందని సంస్థ చెబుతోంది.

మాథ్య్స్​, జీకే, క్వశ్చన్​ అండ్​ ఆన్సర్​లో బెటర్​ పెర్​ఫార్మెన్స్​
అమెరికాలోని మైక్రోసాఫ్ట్​, మెటా వంటి టాప్​ సంస్థలు ఏఐ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. కానీ వారు వెచ్చించే సగం ఖర్చుతోనే డీప్​సీక్​ వస్తోంది. అంతేకాదు.. ఇతర మోడల్స్​తో పోల్చితే డీప్​సీక్​ మాథ్య్స్​, జీకే, క్వశ్చన్​ అండ్​ ఆన్సర్​ పర్ఫార్మెన్స్​లో కూడా ఎంతో బెటర్​గా చేస్తోందని సంస్థ చెబుతోంది. 

వెల్లువెత్తిన డౌన్​లోడ్స్​
ఈ డీప్​సీక్​కి ప్రపంచవ్యాప్తంగా డౌన్​లోడ్స్​ వెల్లువెత్తుతున్నాయి. దీంతో అమెరికాలో యాపిల్ యాప్​​ స్టోర్​లో చాట్​జీపీటీని వెనక్కి నెట్టి, ఈ డీప్​సీక్​ ఆర్​1 టాప్​లో నిలిచింది. డౌన్​లోడ్స్​ తాకిడిని తట్టుకోలేక యాప్​ క్రాష్​ కూడా అవ్వడంతో వెంటనే పునరుద్ధరించారు. అయితే ఆ వెంటనే డీప్​సీక్​ ఐఏ అసిస్ట్​పై సైబర్​ దాడి జరిగింది. ఈ విషయాన్ని చైనా సంస్థ స్వయంగా ప్రకటించింది. ఫలితంగా.. రిజిస్ట్రేషన్​ని తాత్కాలికంగా లిమిట్​ చేస్తున్నట్టు సంస్థ వెల్లడించింది.

పనిచేయని అమెరికా మంత్రం
సాంకేతిక ఆధిపత్య రేసులో చైనా ముందుకు వెళ్లకుండా అమెరికా నిరోధిస్తున్నప్పటికీ.. ఇవేవీ పెద్దగా ప్రభావం చూపడంలేదు. చైనా ఆధిపత్యాన్ని నిలువరించేందుకు జీపీయూ సెమీకండక్టర్ల వంటి హై-ఎండ్ టెక్నాలజీలను ఆ దేశానికి ఎగుమతి చేయడాన్ని అమెరికా నిషేధించింది. అయితే ఇవేవీ తమపై పెద్దగా ప్రభావితం చూపవని డీప్​సీక్ సక్సెస్​తో బహిర్గతమవుతోంది. 


పనతమైన అమెరికా సంస్థల షేర్లు​
డీప్​సీక్​ సంచలనంతో అమెరికాలోని దిగ్గజ సంస్థల షేర్లు కుదేలవుతున్నాయి.  అమెరికా నాస్​డాక్ 3 శాతం​ పతనమైంది. ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ కోసం భారీ డేటా, టెక్​ను రూపొందించే దిగ్గజ కంపెనీ ఎన్​విడియా సంస్థ షేర్లు 17శాతం కుప్పకూలాయి. ఒక్క ట్రేడింగ్​ సెషన్​లోనే ఈ కంపెనీ దాదాపు 600 బిలియన్​ డాలర్లను కోల్పోయింది. ఫలితంగా ఎన్ విడియా కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు జెన్ సెన్ హువాంగ్ సంపద 20.1 బిలియన్ డాలర్లు తగ్గింది. ఇది ఆయన మొత్తం సంపదలో 20 శాతం.

పతనమైన 108 బిలియన్ డాలర్లు 
మొత్తంగా టెక్ కంపెనీల యజమానులు, ప్రపంచంలోని అత్యంత ధనువంతుల సంపద ఏకంగా 108 బిలియన్ డాలర్లు పతనమైంది.  ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ 22.6 బిలియన్ డాలర్లు నష్టపోయారు. ఇది ఆయన మొత్తం సంపదలో 12 శాతం. డెల్ కంపెనీ యజమాని మైకేల్ డెల్ 13 బిలియన్ డాలర్ల నష్టాలు చవిచూశారు. బినాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ సహవ్యవస్థాపకుడు చాంగ్ పెంగ్ సీజడ్ జావో 12.1 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు.

చైనాలోని సున్నిత అంశాలపై నో రెస్పాన్స్​
ఇతర చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ మాదిరిగానే డీప్​సీక్ కూడా చైనాలో సున్నితమైన అంశాలపై స్పందించేందుకు తిరస్కరిస్తోంది. 1989 తియానన్మెన్ స్క్వేర్ నిరసనలు, తైవాన్​పై చైనా దురాక్రమణ వంటి సంఘటనల గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్​పైనా వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.

Continues below advertisement