Indian Navy Rescue Operation: ఒమన్ (Oman)తీరంలో సముద్రంలో గల్లంతైన చమురు ఓడ నుంచి 8 మంది భారతీయులు సహా ఒక శ్రీలంకకు(Sri Lanka) చెందిన సిబ్బందిన భారత నౌకాదళం (Indian Navy) సురక్షితంగా కాపాడింది. మొత్తం 16 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 8 మంది భారతీయులు ఉండగా... ముగ్గురు శ్రీలంకకు చెందిన సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒకరు మృతిచెందగా...మిగిలిన వారి కోసం నౌకాదళం వెతుకులాట కొనసాగిస్తోంది.
ఒమన్ తీరంలో నౌక మునక
ఒమన్ సముద్రం తీరంలో ముడిచమురు తీసుకెళ్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. కోమోరోస్‌కు చెందిన ఎంటీఫాల్కన్ ప్రిస్టీజ్ ఓడ దుబాయి (Dubai)లోని హమరియా పోర్టు నుంచి యమెన్‌లోని పోర్టుకు చమురు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈనెల 14 రాత్రి ఒమన్(Oman) తీరంలో మునిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఓడలో మొత్తం 16మంది సిబ్బంది ఉండగా...అందులో 13 మంది గల్లంతయ్యారు. వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
గల్లంతైన సమాచారం అందుకున్న భారత నౌకాదళం రెస్క్కూ టీం... అక్కడికి వెళ్లి ఒమన్ సిబ్బందితో కలిసి సముద్రంలో చిక్కుకున్న వారిని రక్షించారు. గల్లంతయ్యే వారిలో 8 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంకకు చెందిన వారిని రక్షించారు. వీరితోపాటు ఓ మృతదేహం లభ్యమైంది. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. అయితే ఓడ ప్రమాదం జరిగిన ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు తీవ్ర ప్రతికూలంగా ఉన్నట్లు రక్షణదళం సిబ్బంది చెప్పారు. గాలులు బలంగా వీస్తుండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందన్నారు. ఒమన్ అధికారులతో నిరంతరం చర్చిస్తున్నట్లు మస్కట్‌లోని భారత రాయబారి కార్యాలయం తెలిపింది. ఒమన్ రక్షణదళానికి భారత నావికాదళం సహాయ చర్యలు అందిస్తోందన్నారు. మునిగిపోయిన ఓడలోని వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు వివరించింది.
సవాళ్లతో ప్రయాణం
సముద్ర ప్రయాణం అంటేనే సవాళ్లతో కూడుకున్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అకస్మాత్తుగా వచ్చే తుపాన్లు, భీకరగాలులతో పెద్దపెద్ద ఓడలే తలకిందులవుతాయి. ఉన్నట్టుండి సముద్రం ఆటుపోట్లుకు గురవుతుంది. ఓడల్లో పనిచేసే సిబ్బంది వీటన్నింటినీ తట్టుకుని నిలబడతారు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేసేలా వారికి కఠినమైన శిక్షణ ఉంటుంది. ఒకవేళ అనుకోని ప్రమాదం ఎదురైతే ఏవిధంగా బతికి బయటపడాలో కూడా వారికి నేర్పిస్తారు. కానీ ఒమన్ తీరంలో ప్రమాదానికి గురైన ఓడ ఒక్కసారిగా తిరగబడిపోవడంతో అందులో చిక్కుకున్న వారు బయటకు రాలేకపోయారు. ఎంతో కష్టపడి బయటపడిన వారు తీర రక్షణ దళానికి సమాచారం ఇవ్వడంతో వారు భారత నావికాదళంతో కలిసి సముద్రంలో చిక్కుకున్నవారిని కాపాడారు.
ఆరుగురి జాడ ఇంకా తెలియలేదు. వారిని కూడా ప్రాణాలతో రక్షిస్తామని రక్షణదళం చెబుతోంది. భారతీయ సిబ్బంది రక్షణ కోసం ఇండియన్ ఎంబసీ ఎప్పటికప్పుడు నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. సిబ్బంది మొత్తాన్ని రక్షించే వరకు ఒమన్ రక్షణదళ అధికారులకు సూచనలు ఇచ్చింది. ఈ ఆపరేషన్‌లో భారత సిబ్బందిని సురక్షితంగా కాపాడిన రెస్క్యూటీంకు అభినందనలు తెలిపింది. సిబ్బంది చూపిన సాహసాన్ని మెచ్చుకుంది. మిగిలిన సిబ్బంది భారతీయులు కాకున్నా మానవతా దృక్పథంతో ఇండియన్ నేవీ సహాయ చర్యలు కొనసాగిస్తోంది.
Also Read: జో బైడెన్‌కి కొవిడ్ పాజిటివ్, వెంటనే ఐసోలేషన్‌లోకి - ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకుంటారా?