H-1B Registration : మార్చి 7 నుంచి H-1B క్యాప్ రిజిస్ట్రేషన్ - కీలక మార్పులు చేసిన యూఎస్సీఐఎస్
H-1B Registration : 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ హెచ్-1బి రిజిస్ట్రేషన్ ప్రక్రియను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది.
H-1B Registration : 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ హెచ్-1బి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్నియూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ - యూఎస్సీఐఎస్ (US Citizenship and Immigration Services) మార్చి 7 నుంచి ప్రారంభిచనుంది. ఈ హెచ్-1బి క్యాప్ రిజిస్ట్రేషన్ పిరియడ్ జనవరి 7 నుంచి ప్రారంభమైంది. ఇది మార్చి 24న ముగియనున్నట్టు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అధికారికంగా ప్రకటించింది.
భారీ మొత్తంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు
చెల్లింపు విషయంలో చాలా మంది యజమానులు సర్దుబాటు చేసుకోవలసిన ఆసక్తికరమైన మార్పు ఏమిటంటే, కొత్త రుసుము నిర్మాణం. దరఖాస్తుదారునికి రిజిస్ట్రేషన్ రుసుము 10 డాలర్ల నుండి 215 డాలర్లకు పెరిగింది. లాటరీ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవాస్తవ రిజిస్ట్రేషన్ పథకాలను తగ్గించడమే లక్ష్యంగా అధికారులు ఈ చర్యలకు ఉపక్రమించారు. బైడెన్ (Joe Biden) సర్కార్ తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా, హెచ్ -1బీ వీసా దరఖాస్తుదారుల రిజిస్ట్రేషన్ ఖర్చులు భారీగా పెరిగాయి. వీసా ప్రోగ్రామ్ సమగ్రతను పెంచేందుకే ఈ మార్పులను తీసుకొచ్చారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పెను మార్పులు
బెనిషియరీ సెంట్రిక్ సిస్టమ్ (Beneficiary Centric System)ను గతేడాదే ప్రారంభించగా.. ఈ సంవత్సరమూ ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. దీని ప్రకారం దరఖాస్తుదారులు ఒక్కొక్కరు ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసినా ఒక్కసారి మాత్రమే వారి పేరును లాటరీలో నమోదు చేస్తారు. దరఖాస్తుదారుని పాస్ పోర్ట్ నంబర్ ను పరిగణలోకి తీసుతుని ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇది ప్రత్యేక ఐడెంటిఫైయర్ గా పనిచేస్తుంది. ఒకే వ్యక్తి బహుళ ఎంట్రీలను నివారించేందుకు ఈ విధానాన్ని తీసుకువచ్చారు.
ఎంపిక చేసిన ఉద్యోగుల యజమానులు అప్లికేషన్స్ ను స్వీకరించిన తర్వాత, వారు H-1B వీసా దరఖాస్తుకు అనుగుణంగా ఉండాలి. అవసరమైన సహాయక పత్రాలు, రుసుములను సమర్పించాలి. గతంలో, అనేక మంది యూఎస్ ఉద్యోగులు (US Employees) గతంలో దాఖలు చేయకపోతే లేదా రిజెక్షన్స్ ఉంటే, మిగిలిన H-1B వీసా కోటాను పూరించడానికి USCIS రెండవ లాటరీని నిర్వహించేది. అయితే, కొత్త వ్యవస్థ కింద, ఏజెన్సీ దీన్ని సాధ్యమైనంత అరుదుగా చేయాలని భావిస్తోంది.
హెచ్-1బి రిజిస్ట్రేషన్ (H-1B registration), లాటరీ ప్రక్రియ గురించి..
ఎప్పటిలాగే వార్షిక పరిమితి అయిన 85వేలు (ఇందులో 20వేలు విదేశీ విద్యార్థులకు రిజర్వ్డ్) హెచ్-1బి వీసాల కన్నా ఎక్కువ హెచ్ - బీ రిజిస్ట్రేషన్స్ వస్తాయని ఇమ్మిగ్రేషన్ సర్వీస్ అంచనా వేస్తోంది. దీనికి గడువు ముగిసిన తర్వాత, హెచ్-1బి లబ్దిదారులను ఎంపిక చేయడానికి యూఎస్సీఐఎస్ లాటరీ విధానాన్ని చేపట్టింది. దీని ద్వారా వార్షిక పరిమితి 65వేల వీసా(Visa)లకు లబ్దిదారులను ఎంపిక చేస్తారు.
Also Read : Dunki Route : ‘డంకీ రూట్’ మార్గం గుండా అమెరికాలోకి అక్రమ వలసలు- ఆ 97 కి.మి.లు నరకమే