PM Modi In US:అమెరికా గడ్డపై కాలు పెట్టిన ప్రధానమంత్రి మోదీ, సుంకాలపై ట్రంప్‌ను ఒప్పించగలరా?

PM Modi In US:ఫ్రాన్స్ పర్యటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు.

Continues below advertisement

PM Modi In US:ప్రధానమంత్రి మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగించుకొని ఈ ఉదయం అమెరికాలో అడుగు పెట్టారు. వాషింగ్టన్‌ చేరుకున్న మోదీకి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి బ్లెయిర్ హౌస్‌కు చేరుకున్న సమయంలో మోదీకి NRIలు సాదర స్వాగతం పలికారు. బ్లెయిర్ హౌస్‌లో కాసేపు గడిపిన ప్రధాని మోదీ తర్వాత అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌ను కలిశారు. 

Continues below advertisement

తులసి గబ్బర్డ్ నియామకం బుధవారం  పూర్తైంది. ఆమె నియామకానికి సెనేట్ అనుకూలంగా ఓటు వేసి ఎన్నుకుంది. దీంతో ఆమె అమెరికాలోని 18 నిఘా సంస్థలకు అధిపతి అయ్యారు. అందుకే ప్రధాని మోదీ తన అమెరికా పర్యటనలో ముందుగా తులసిని కలిసి అభినందించనున్నారు.  

Image

తులసి గబ్బర్డ్‌ను కలిసిన తర్వాత, ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో ఒక పోస్ట్‌ను పోస్ట్ చేశారు. అందులో ఇలా రాశారు.'వాషింగ్టన్ డిసిలో యుఎస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌ను కలిశాను.' ఆమెకు అభినందనలు. భారతదేశం-అమెరికా స్నేహానికి సంబంధించిన వివిధ అంశాలు చర్చించాము."

రెండో రోజు పర్యటనలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీలలో మోదీ, ట్రంప్ రెండు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ సహకారాన్ని పెంచడం వంటి అనేక అంశాలు చర్చిస్తారు. అత్యంత ముఖ్యమైన అంశాలు కూడా చర్చకు వస్తాయా లేదా అనేది చూడాలి. దేశం నుంచి అక్రమ వలసదారులను అమావీయంగా పంపేస్తోంది అమెరికా, భారత్‌ ఎగుమతి చేసే వస్తువులపై పన్నులు కూడా భారీగా వేయబోతోంది. ఈ రెండు అంశాలు చర్చకు వస్తాయా అనేది ఆసక్తిగా మారింది. 

భారతదేశం ఇప్పటికే వలసదారులను పంపేస్తోంది. ఇదే అంశం పార్లమెంటును షేక్ చేసింది. ఇప్పటి వరకు భారత్‌ భారతదేశ ఎగుమతులపై  అమెరికా పన్నులు విధించలేదు. కానీ ఎప్పుడైనా స్టార్ట్ చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో, ప్రధాని మోడీ ట్రంప్‌ చర్చల్లో దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందా అనేది చూడాలి. 

బహిష్కరణ సరైనదే కానీ పద్ధతి బాలేదు
ఫిబ్రవరి 5న, 104 మంది అక్రమ వలసదారులను అమెరికన్ సైనిక విమానంలో భారత్‌కు పంపించారు. వందలాదిని ఇంకా పంపిస్తామంటూ చెబుతున్నారు. అక్రమ వలసదారులను గతంలో కూడా పంపించడం జరిగింది. కానీ ఈసారి పంపిన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక సైనిక విమానంలో సంకెళ్లు వేసి తీసుకువచ్చారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని సభలో ఇరుకున పెట్టాయి. బహిష్కరణ సరే కానీ అమానవీయంగా పంపకూడదని అంటున్నారు. ట్రంప్‌తో జరిగే సమావేశంలో ప్రధాని మోదీ ఈ అంశాన్ని లేవనెత్తాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ అంశంపై నెలకొన్న గందరగోళం చూస్తే ట్రంప్‌తో సమావేశంలో ప్రధాని మోదీ ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. కానీ ట్రంప్ దీనికి అంగీకరించడం అంత సులభం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపాలని నిర్ణయించుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున అమెరికా నుంచి బహిష్కరణ బహుశా ఇంతకు ముందు ఎప్పుడూ జరిగి ఉండదు. ఇంత పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపించడానికి సాధారణ విమానాలను ఉపయోగించరు. అయితే భారతీయులను తీసుకురావడానికి మనం విమానాలను పంపే అవకాశం ఉంది. దీనిపై చర్చ జరుగుతుందో లేదో చూడాలి. 

సుంకాల వాత ప్రారంభం కాకముందే... 
డోనాల్డ్ ట్రంప్ తన పొరుగు దేశాలైన మెక్సికో, కెనడా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25% పన్ను విధిస్తున్నారు. చైనా గూడ్స్‌పై 10% ట్యాక్స్ విధిస్తామని ప్రకటించారు. భారత్‌ వంతు ఇంకా రాలేదు. గత టెర్మ్‌లో భారతదేశాన్ని సుంకాల రాజు అని ట్రంప్ విమర్శలు చేశారు. అమెరికాలో భారతీయ దిగుమతులపై పన్నులు లేవని, కానీ భారతదేశంలో అమెరికన్ ఎగుమతులపై ఏకపక్ష ట్యాక్స్ వేశారని విమర్శించారు. హార్లే డేవిడ్సన్ బైక్‌లపై పన్ను విషయంలో భారత్‌ను టార్గెట్ చేసుకున్నారు. అందుకే భారతదేశంపై కూడా ట్యాక్స్ వార్‌ను ప్రకటించే ఛాన్స్ లేకపోలేదు. 

అమెరికా, భారత్‌ వాణిజ్యంలో అడ్డంకులు లేకుండా ప్రధాని మోదీ ప్రయత్నిస్తారని అంటున్నారు. ఈ విషయంలో ట్రంప్‌తో చర్చిస్తారు. కానీ ట్రంప్ ఈ విషయంలో లొంగుతారరా పన్నుల నుంచి మినహాయింపు ఇస్తారా అనే అనుమానంగానే ఉంది. 

Also Read: ఉచితాలపై ఆధారపడి ప్రజలు పని చేయడం లేదు- ఫ్రీ స్కీమ్స్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Continues below advertisement