Worlds Shortest Dog: 2020 సెప్టెంబర్ 1వ తేదీ రోజు పుట్టిన చువావా జాతికి చెందిన పర్ల్ అనే ఆడ కుక్క.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి కుక్కగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది. అమెరికాలో ఉంటున్న ఈ కుక్క పొడవు.. కేవలం 9.14 సెం.మీ మాత్రమే. అంటే కేవలం 3.59 అంగుళాలు ఎత్తు మాత్రమే ఉంది. అంటే ఐస్ క్రీమ్ పుల్లల కంటే (పాప్సికల్ స్టిక్) చిన్నగా ఉంటుంది. అంతే కాదండోయ్ ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ అయిన జ్యోతి అమ్గే కంటే పర్ల్ దాదాపు ఏడు రెట్లు చిన్నగా ఉంటుంది. పొడవులో పెర్ల్ 12.7 సెం.మీ (5.0 అంగుళాలు) ఉంటుంది. అలాగే కేవలం 553 గ్రాముల(1.22 పౌండ్ల) బరువు మాత్రమే ఉంటుంది.




డాలర్ నోటు అంత పరిమాణంలో ఉన్న పర్ల్


అత్యంత పొట్టి కుక్కగా గతంలో పేరు తెచ్చుకున్న మిరాకిల్ మిల్లీకి పెర్ల్ బాగా తెలుసు మిరాకిల్ మిల్లీ అనే మగ కుక్క 9.65 సెంటీ మీటర్లు,3.8 అంగుళాలు ఉంటుంది. కానీ ఈ కుక్క పర్ల్ పుట్టక ముందే 2020 సంవత్సరంలో చనిపోయింది.  అయితే మిరాకిల్ మిల్లీ సోదరికి పుట్టిందే ఈ పర్ల్. మిరాకిల్ మిల్లీ లాగే పెర్ట్ కూడా పుట్టినప్పుడు ఒక ఔన్స్ అంటే 28 గ్రాముల కంటే తక్కువ బరువును కల్గి ఉంది. 




"పర్ల్ మా దగ్గర ఉండడం నిజంగా మా అదృష్టం" అని పర్ల్ యజమాని వనేసా సెమ్లర్ అన్నారు. అలాగే తమ కుక్క గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డులో స్థానం సంపాదించుకోవడం తమకు చాలా ఆనందాన్ని కల్గిస్తోందని చెప్పారు. అయితే ఇటీవలే ఇటలీలోలని మిలాన్ లో.. మా టీవీ టాలెంట్ షోలో.. షోడీ రికార్డ్ సెట్‌ ద్వారా పర్ల్ ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఈస్టర్ గుడ్డు ఆకారపు సీటులో.. వనేసా ఆమెను వేదికపైకి తీసుకువెళ్లారు. మొదటిసారి పర్ల్ ను చూసిన ప్రతీ ఒక్కరూ తెగ ఆశ్చర్యపోయారు. అలాగే వనేసాను కూడా విపరీతంగా ప్రశంసించారు. 




చికెన్ తో పాటు సాల్మన్..


పర్ల్ కు చికెన్, సాల్మన్ అంటే చాలా ఇష్టమట. అధిక నాణ్యత గల ఆహారాన్ని తినడానికే పర్ల్ ఇష్టపడుతుందట. అంతే కాదండోయ్ మంచి బట్టలు ధరించడం అంటే కాడా పర్ల్ కు చాలా ఇష్టం అని.. యజమాని వనేసా తెలిపారు. అలాగే తమ వద్ద మొత్తం మూడు కుక్కలు ఉండగా.. రెండు సాధారణమైన పరిమాణంలో ఉన్నాయని, పర్ల్ మాత్రమే చిన్నగా ఉందని చెప్పారు. అవర్ డాగ్స్ వీక్లీ వార్తా పత్రికకు మాజీ ఎడిటర్ అయిన ఆర్థర్ మార్పుల్స్ (UK)కి చెందిన మరుగుజ్జు యార్క్‌షైర్ టెర్రియర్ ఇప్పటి వరకు రికార్డ్ చేయబడిన అతి పొట్టి కుక్క. పిడికిలి పరిమాణంలో ఉన్న ఆ కుక్క 7.11 సెం.మీ (2.8 అంగుళాలు) ఎత్తులో ఉండేదట. అలాగే దాని ముక్కు కొన నుంచి తోక కొన వరకు 9.5 సెం.మీ (3.75 అంగుళాలు) ఉండేదట. కానీ ఆ కుక్క దాని రెండవ పుట్టిన రోజుకు ముందే మరణించింది.