Fresh Gen Z protests erupt in Nepal:  నేపాల్‌లోని బారా జిల్లాలో జనరేషన్-జె యువత  మరోసారి రోడ్డెక్కింది.  కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యునిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్  కార్యకర్తలు జెన్ Z యువకులపై దాడి చేసినట్లు ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో  సిమారా ప్రాంతంలో కొత్తగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.  పోలీసులు టియర్ గ్యాస్‌లు వాడినా ప్రయోజనం లేకపోవడంతో  మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 8 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.                  

Continues below advertisement

బారా జిల్లాలో గురువారం ఉదయం నుంచే ఘర్షణలు ప్రారంభమయ్యాయి. సిమారా చౌక్ వద్ద ఎయిర్‌పోర్ట్ సమీపంలో జెన్-z నాయకుడు సమ్రాట్ ఉపాధ్యాయ్ సహా ఏడుగురు యువకులు గాయపడ్డారు. 10-12 మంది సిపిఎన్-యుఎమ్ఎల్ కార్యకర్తలు శాంతియుతంగా సమావేశమైన యువకులపై దాడి చేశారని  వారు ఆరోపించారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు టియర్ గ్యాస్‌లు ప్రయోగించారు.   సిమారా ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు తాత్కాలికంగా ఆపేశారు.                                        

జెన్ జెడ్ నిరసనలు మొదట్లో ప్రభుత్వం సోషల్ మీడియా నిషేధం కారణంగా ప్రారంభమయ్యాయి.  ఈ తిరుగుబాటు 76 మంది మరణాలకు, మాజీ ప్రధాని కేపీ ఒలి రాజీనామా ఇవ్వడానికి దారితీసింది. ప్రస్తుతం జెన్-జె యువత మాహేష్ బాస్నెట్ , దాడికి పాల్పడిన యుఎమ్ఎల్ కార్యకర్తల అరెస్టుకు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘర్షణలపై మధ్యంతర ప్రధాని సుశీలా కార్కి స్పందించారు. దేశంలో అనవసర వివాదాలు సృష్టించకుండా ఉండాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు.   శాంతి ,  క్రమశిక్షణను కాపాడటానికి అత్యంత జాగ్రత్తలతో పనిచేయాలని  భద్రతా దళాలను ఆదేశించినట్లుగా ప్రకటించారు.  

సెప్టెంబర్ తిరుగుబాటు తర్వాత జైలు నుంచి వేలాదిమంది ఖైదీలు పారిపోయారు. ఆయుధాలు తగ్గిపోయాయి.  ఇది భద్రతా పరిస్థితిని మరింత బలహీనం చేసింది. అందుకే ప్రభుత్వం ఎలాంటి నిరసనలు జరిగినా కంగారు పడుతోంది.