France Elections 2022: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌కు భారీ షాక్ తగిలింది. ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ అయిన నేషనల్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో మేక్రాన్‌ సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది.






ఇందేటి ఇలా


ఈ ఎన్నికల్లో మేక్రాన్​ కూటమి భారీగా స్థానాలను కోల్పోయింది. మొత్తం 577 స్థానాల్లో 245 సీట్లు మేక్రాన్​ సంకీర్ణ ప్రభుత్వానికి దక్కాయి. జాతీయ అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీ దక్కాలంటే 289 సీట్లు రావాల్సి ఉంది. వామపక్ష నేత జీన్ లూక్ మెలెన్‌చోన్ నేతృత్వంలోని కూటమి న్యూప్స్ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. మొత్తం 131 స్థానాల్లో విజయం సాధించింది.






అయితే సంపూర్ణ మెజారిటీ దక్కకపోయినా మిగతా పార్టీల కంటే మేక్రాన్ సారథ్యంలోని సెంట్రిస్ట్​ కూటమి ఎక్కువ స్థానాలను దక్కించుకుంది. ఈ మేరకు సీఎన్‌ఎన్ తెలిపింది. మితవాద నేషనల్‌ ర్యాలీ పా ర్టీకి 89 స్థానాలు దక్కాయి. తాజా ఫలితాలు ఫ్రెంచ్‌ రాజకీయాలను గందరగోళంలో పడేశాయి.


2000లో వచ్చిన ఎన్నికల సంస్కరణల తర్వాత దిగువ పార్లమెంట్​లో మెజారిటీ సాధించని మొదటి సిట్టింగ్ అధ్యక్షుడిగా మేక్రాన్ చరిత్రలో నిలిచిపోనున్నారు. ప్రస్తుతం మేక్రాన్ ప్రతిపక్ష పార్టీల నేతలతో భేటీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు కొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి.


Also Read: Govt Jobs For Retired Agniveers: అగ్నివీరులకు ఆ సీఎం బంపర్ ఆఫర్- రాష్ట్రంలో ఉద్యోగాలిస్తామని ప్రకటన


Also Read: Presidential Polls 2022: రాష్ట్రపతి రేసులో భాజపా మాజీ నేత యశ్వంత్ సిన్హా- పక్కాగా దీదీ వ్యూహం!