ట్విట్టర్ యూజర్లు ఎప్పటి నుంచో చూస్తున్న కొత్త ఫీచర్ వచ్చేసింది. కానీ కొంతమంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
ట్విట్టర్‌లో ఎడిట్ ఆఫ్షన్ కోసం చాలా కాలంగా చర్చ నడుస్తోంది. ట్విట్టర్ కూడా దీనిపై ఎప్పటి నుంచో పని చేస్తోంది. ప్రస్తుతం లీకైన సమాచారం ప్రకారం త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. మైక్రో-బ్లాగింగ్ సైట్ కొంతమంది వినియోగదారుల కోసం ఎడిట్ బటన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
లీక్‌స్టర్ ముకుల్ శర్మ చెప్పిన వివరాల ప్రకారం.. ట్విట్టర్ ఎడిట్ బటన్ అభ్యంతరకరమైన లేదా దుర్వినియోగమైన ట్వీట్‌లను సవరించడానికి మాత్రమే పని చేస్తుంది. కంపెనీ లైక్, డిస్‌లైక్ ఫీచర్‌ను కూడా పరీక్షిస్తోంది.
"Twitter సవరణ బటన్ అందుబాటులోకి వచ్చింది. కానీ ప్రస్తుతానికి దుర్వినియోగం/హానికరమైన/ఆక్షేపణీయమైన ట్వీట్‌ల కోసం మాత్రమే. అంతేకాకుండా, Twitter లైక్/డిస్‌లైక్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది, ఇది నోటిఫికేషన్‌ల విభాగంలోనే డాటా (లైక్స్, కామెంట్స్, రీట్వీట్‌లు) వీక్షించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది." అని లీక్‌స్టర్ తన హ్యాండిల్ @stufflistings నుంచి ట్వీట్ చేశారు.
వినియోగదారులు దుర్వినియోగమైన లేదా అభ్యంతరకరమైన ట్వీట్‌ను పోస్ట్ చేయబోతున్నప్పుడు కంపెనీ వారికి వార్నింగ్ ఇస్తుంది. వినియోగదారులు అభ్యంతరకరమైన లేదా దుర్వినియోగమైన ట్వీట్‌లను పోస్ట్ చేసినప్పుడు, మూడు ఆప్షన్‌లు కనిపిస్తాయి. అవి ట్వీట్‌ను సవరించడానికి, తొలగించడానికి లేదా పోస్ట్ చేయడానికి వీలు కల్పిస్తాయి. మరొక ఊహించిన ఫీచర్ లైక్/డిస్‌లైక్ బటన్, ఇది నోటిఫికేషన్‌ల ప్యానెల్ నుంచి నేరుగా వినియోగదారులను లైక్/అన్‌లైన్ చేస్తుంది. ఈ ఫీచర్ కూడా కొంతకాలంగా పరీక్షించనున్నారు.
ఏప్రిల్‌లో ఎంపిక చేసిన ట్విట్టర్ బ్లూ సభ్యులతో రాబోయే రోజుల్లో ఎడిట్ బటన్ ఫీచర్‌ను పరీక్షిస్తానని ట్విట్టర్ తెలిపింది. ఈ మధ్య దీనిపై ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. దీంతో పెను సంచలనంగా మారింది. అయితే ఈ ట్వీట్ తర్వాత తాము దీనిపై పని చేయడం లేదని... అంతకు ముందు నుంచే ఈ ఆప్షన్‌పై వర్క్ చేస్తున్నట్టు ట్విట్టర్ వివరణ ఇచ్చింది.