పాకిస్తాన్‌లోని కరాచీలోని పాకిస్తాన్‌ యూనివర్సిటీలో పేలుడుకు తామే కారణం అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ( BLA ) ప్రకటించుకుంది. మహిళా ఆత్మాహుతి బాంబర్ షరీ బలోచ్ అలియాస్ బ్రాంశ్‌గా ప్రకటించారు. ఆమె కారులో పేలుడు పదార్థాలతో సహా యూనివర్శిటీలోకి వెళ్లి చైనీయులను లక్ష్యంగా చేసుకుని పేల్చేసుకుంది. పేలుడు ధాటికి నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఇందులో ముగ్గురు చైనా జాతీయులు. మహిళా ఆత్మహుతి దళ సభ్యురాలి ఫోటోను కూడా బీఎల్‌ఏ విడుదల చేసింది. బురఖా ధరించిని వ్యక్తి వ్యాన్  దగ్గరకు వెళ్లగానే పేలుడు జరిగినట్లు..సీసీటీవీ పుటేజీలో రికార్డు అయింది.  జూలై 2021లో వాయువ్య ప్రాంతంలోని దాసు వద్ద బస్సుపై బాంబు దాడి చేసి తొమ్మిది మంది చైనీస్ జాతీయులను చంపిన తర్వాత పాకిస్తాన్‌లో చైనా జాతీయులపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే. 


మూడో ప్రపంచ యుద్ధంపై మరోసారి రష్యా హెచ్చరికలు- ఈసారి డోసు పెంచిందే!


పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ ప్రాంత వాసులు చాలా కాలంగా వేర్పాటు కోరుతున్నారు. అయితే వారిని పాకిస్తాన్ పాలకులు పాశవికంగా అణిచివేస్తున్నారు. దీతో తమ ప్రాంత విముక్తి కోసం వారు పోరాటం చేస్తున్నారు.  పాకిస్తాన్‌లో బలూచిస్తానే అతిపెద్ద ప్రావిన్సు. పాకిస్తాన్ దేశం అవతరించి 72 ఏళ్లు గడుస్తున్నా, ఇంకా ఆ ప్రాంతం సమస్యాత్మకంగానే ఉంది.  పాకిస్తాన్‌లో తమను బలవంతంగా, చట్టవిరుద్ధంగా కలిపారన్నది చాలా మంది బలూచిస్తాన్ ప్రజల భావన. 1948లో ఈ సమస్య మొదలైంది. బ్రిటీష్ పాలకులు వెళ్లిపోయాక బలూచ్ ప్రజలు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. పాకిస్తాన్ కూడా దీనికి సమ్మతి తెలిపింది. కానీ, ఆ తర్వాత మాట మార్చింది. బలవంతంగా తమలో కలుపుకుంది. 


ఆ విషయంలో మూడో స్థానంలో భారత్- చైనా, అమెరికాకు పోటీగా


తమ ప్రాంత స్వాతంత్ర్యం కోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 1970లో ప్రారంభమయింది.  2006లో పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. అణచివేత అధికారం కావడంతో  బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఆత్మాహుతి దాడులు కూడా మొదలయ్యాయి. వాటిని సంస్థ 'ఫిదాయీ దాడులు'గా చెప్పుకుంటుంది. 2018 నవంబర్‌లో కరాచీలోని చైనా రాయబార కార్యాలయంపై జరిగిన మిలిటెంట్ దాడికి కూడా తామే బాధ్యులమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్పింది. దీనిని ముగ్గురు ఆత్మాహుతి దళ సభ్యులు చేశారు.


బలూచిస్థాన్ ప్రాంతంలో చైనా కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ చైనా ఆధిపత్యం ఉంటుంది. అక్కడి ప్రజలపై నిర్బంధాలకు పాల్పడుతూ ఉంటుంది. అందుకే బీఎల్‌ఏ చైనాను టార్గెట్ చేసుకుందని భావిస్తున్నారు.