Karachi Blast: కరాచీ యూనివర్సిటీలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చైనా ప్రొఫెసర్లు సహా నలుగురు మృతి చెందినట్లు సమచారం. యూనివర్సిటీలోని ఓ కారులో పెట్టిన బాంబు పేలడంతో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఏం జరిగింది?
యూనివర్సిటీలో ఉన్న ఓ కారులో బాంబు పేలడంతో ఈ ఘటన జరిగింది. పేలుడులో ముగ్గురు చైనా ప్రొఫెసర్లు సహా నలుగురు మృతి చెందారు. మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
కరాచీ యూనివర్సిటీ క్యాంపస్‌లోని కన్ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పేలుడు జరిగిన సమయంలో వాహనంలో 8 మంది ఉన్నారని సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి. మృతులు కన్ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్‌లో చైనా భాష నేర్పించే అధ్యాపకులని తేలింది.
Also Read: Tej Pratap Yadav: లాలూకు మరో షాక్- పార్టీకి పెద్ద కుమారుడు గుడ్‌బై