Elon Musk says there is no need to save money: ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఇలోన్ మస్క్ భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ , పేదరికంపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కృత్రిమ మేధస్సు  ,రోబోటిక్స్ విప్లవం కారణంగా భవిష్యత్తులో పేదరికం అనేదే ఉండదని, అందువల్ల డబ్బు ఆదా చేయాల్సిన అవసరం రాకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. 

Continues below advertisement

ముందు ముందు అన్నీ ఉచితంగా వస్తాయట!                          

టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, భవిష్యత్తులో మనం 'సమృద్ధి యుగం' లోకి అడుగుపెట్టబోతున్నామని మస్క్ అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధస్సు ,  హ్యూమనాయిడ్ రోబోలు  వస్తువులు , సేవల ఉత్పత్తి వ్యయాన్ని దాదాపు శూన్యానికి తగ్గిస్తాయని ఆయన వివరించారు. దీనివల్ల ప్రతి ఒక్కరికీ కావాల్సిన కనీస అవసరాలు చాలా తక్కువ ధరకు లేదా ఉచితంగా లభించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.                     

Continues below advertisement

పనులన్నీ ఏఐ, రోబోలు చేస్తాయి !                      రోబోలు శారీరక శ్రమతో కూడిన పనులన్నింటినీ చేపడతాయని, దీనివల్ల వస్తువుల ఉత్పత్తిలో మానవ ప్రమేయం తగ్గి ధరలు భారీగా పడిపోతాయని మస్క్ విశ్లేషించారు. అప్పుడు సమాజంలో 'యూనివర్సల్ హై ఇన్‌కమ్'  అనే వ్యవస్థ వస్తుందని, ప్రజలు జీవనోపాధి కోసం కష్టపడాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. పేదరికం అనేది కేవలం చరిత్ర పుటలకే పరిమితం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.                     

డబ్బులు కూడబెట్టుకోవడం కూడా అనవసరం            సాధారణంగా ప్రజలు భవిష్యత్తులో ఇబ్బందులు రాకూడదని, వృద్ధాప్యం లేదా అత్యవసరాల కోసం డబ్బు ఆదా చేస్తారు. అయితే, భవిష్యత్తులో వనరుల కొరత ఉండదని, అందరికీ అన్నీ లభిస్తాయని మస్క్  చెబుతున్నారు.  వస్తువులు ,  సేవలకు కొరత లేనప్పుడు, వాటిని కొనుగోలు చేయడానికి భారీగా డబ్బు దాచుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు కావాల్సిన ప్రతిదీ అందుబాటులో ఉన్నప్పుడు డబ్బు విలువ కూడా మారుతుంది  అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం వైరల్ గా మారుతోంది.         

మరి ఏఐ వాడకానికి డబ్బులు ఎలా?    

మస్క్ అంచనా ప్రకారం, భవిష్యత్తులో పని అనేది ఒక ఆప్షన్ మాత్రమే అవుతుంది. ప్రజలు తమకు ఇష్టమైన వ్యాపకాలు లేదా సృజనాత్మక పనుల కోసం సమయాన్ని వెచ్చిస్తారని అంటున్నారు. అయితే, మస్క్ వ్యాపార ప్రయోజనాల కోసమే ఇలాంటి కలలు చూపిస్తున్నారని కొందరు ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు. టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని, కేవలం కొద్దిమంది చేతుల్లోనే సంపద కేంద్రీకృతమయ్యే ముప్పు ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అయితే జనం దగ్గర డబ్బులు లేకపోతే ఏఐను ఇతర టెక్నాలజీని ఎవరు ఉపయోగిస్తారని మస్క్ కూడా ఎదురు ప్రశ్నిస్తున్నారు.