Elon Musk Father Reunion: 


తండ్రితో ఎలన్ మస్క్..


అంతరిక్ష పరిశోధనల్లో ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టించే SpaceX గత వారమే Starship ని లాంఛ్ చేసింది. స్పేస్‌ఎక్స్ జర్నీలో ఇదో మైల్‌స్టోన్. అందుకే ఈ ఈవెంట్‌ని చాలా గ్రాండ్‌గా చేశాడు ఎలన్ మస్క్ (Elon Musk). ఇదే ఈవెంట్‌లో ఓ అరుదైన సంఘటనా జరిగింది. దాదాపు ఏడేళ్ల తరవాత తన తండ్రి ఎరాల్ మస్క్‌ని (Errol Musk) కలిశాడు ఎలన్ మస్క్. The Sun వెల్లడించిన వివరాల ప్రకారం..టెక్సాస్‌లోని Boca Chicaలో ఈ రీయూనియన్‌ జరిగింది. తన మాజీ భార్యతో కలిసి ఈ ఈవెంట్‌కి అటెండ్ అయ్యారు ఎరాల్ మస్క్. ఏడేళ్లుగా తండ్రికొడుకులు కలుసుకోలేదు. ఇన్ని రోజుల తరవాత వీళ్లిద్దరూ కలిసి ఓ ఈవెంట్‌లో కనబడడం ఆసక్తిని పెంచింది. స్పేస్‌ఎక్స్ తయారు చేసిన అతిపెద్ద రాకెట్‌ Starship.ఇంత కీలకమైన ఈవెంట్‌లో తండ్రీ ఉండాలనుకున్నాడట ఎలన్ మస్క్. అందుకే విభేదాలన్నీ పక్కన పెట్టి మరీ ఆయనకు వెల్‌కమ్ చెప్పాడు. 2016లో ఎలన్ మస్క్‌తో పాటు ఆయన సోదరుడు కింబాల్‌ కలిసి తండ్రి 70వ పుట్టిన రోజు వేడుకలు చేశారు. చివరిసారిగా ఎలన్‌ మస్క్‌ తండ్రితో కలిసి ఉంది అప్పుడే. అసలు ఈ లాంఛింగ్ ఈవెంట్‌కి తనకు ఇన్విటేషన్ వస్తుందని ఊహించలేదట ఎరాల్ మస్క్. ఇది చూసి షాక్ అయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. కలుసుకున్న వెంటనే ఇద్దరూ ఎమోషనల్ అయ్యారట. కన్నీళ్లు పెట్టుకున్నారట. ఎలన్ మస్క్, ఎరాల్ మస్క్ పక్కపక్కనే కూర్చుని చాలా సేపు కబుర్లు చెప్పుకున్నారని The Sun వెల్లడించింది. చాలా రోజుల తరవాత తండ్రి మాట్లాడడం వల్ల ఎలన్ మస్క్ భావోద్వేగానికి లోనయ్యారని తెలిపింది. 


ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్..


స్టార్‌షిప్ స్పేస్‌క్రాఫ్ట్‌ (Starship spacecraft) లాంఛింగ్‌ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది స్పేస్‌ఎక్స్. అయితే..లిఫ్టాఫ్‌ అయిన 8 నిముషాలకే అది పేలిపోయింది. అయినా దీన్ని సక్సెస్‌గానే చెప్పుకుంటోంది ఆ సంస్థ. మార్స్‌పైకి మనుషుల్ని పంపేందుకు ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ని తయారు చేస్తోంది స్పేస్‌ఎక్స్. ఇది ఎలన్ మస్క్ డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే అంతగా పట్టువదలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. 


Also Read: Tesla in India: భారత్‌లో ఫ్యాక్టరీ పెట్టేందుకు టెస్లా ఓకే, కానీ ఆ ఒక్క కండీషన్‌ వల్లే ఆలస్యం!


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply