Elon Musk: టెస్లా, ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ పధ్నాలుగో బిడ్డకు తండ్రి అయ్యారు. న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్‌తో సహజీవనం చేస్తున్న ఆయన పధ్నాలుగో సంతానంగా మగపిల్లవాడికి తండ్రి అయ్యారు. ఈ బిడ్డకు ఇప్పుడు పంజాబీ మూలాలు ఉన్నాయని బయటపడింది. బిడ్డకు జన్మనిచ్చిన శివోన్ జిలిస్‌కి పంజాబీ నేపధ్యం ఉంది. షివోన్ జిలిస్ కెనడాలోని ఒంటారియోలో పంజాబీ భారతీయ తల్లి , కాకేసియన్ కెనడియన్ తండ్రికి జన్మించారు. 2015 లో పీపుల్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు పంజాబీల తరహాలో చాలా పెద్ద కళ్లు వచ్చాయని చెప్పింది.
మస్క్ తో కలిసి నలుగురు పిల్లల్ని కన్న శివోన్ జోలిస్ తల్లి పంజాబీ
ఎలోన్ మస్క్ పిల్లలలో నలుగురు వారి తల్లి శివోన్ జిలిస్ భారతీయ మూలాలను కలిగి ఉన్నారని తెలుసుకుని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. జిలిస్ తల్లి పంజాబ్‌కు చెందిన వారని ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు. బయటపడిన తర్వాత ఎలాన్ మస్క్ కూడా ఇండియాకు మంచి సంబంధాలు ఉన్నాయని సెటైర్లు వేస్తున్నారు.
పంజాబీల్లా తనకు పెద్ద కళ్లు వచ్చాయని చెప్పుకునే జోలిస్
మార్చి 1న శివోన్ జిలిస్ తనకు మరియు మస్క్‌కు నాల్గవ బిడ్డ పుట్టినట్లు ప్రకటించారు. ఆ బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ అని పేరు పెట్టారని ఆమె వెల్లడించారు. జిలిస్ 2008లో యేల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రం మరియు తత్వశాస్త్రంలో డిగ్రీ చేసింది. ఆమెకు టెక్ పరిశ్రమలో మంచి పేరు ఉంది. IBMలో , బ్లూమ్‌బెర్గ్ బీటాలో పనిచేశారు. న్యూరాలిగ్ లో ఆమె మెషిన్ ఇంటెలిజెన్స్‌పై దృష్టి పెట్టింది. ఆమె 2017 నుండి 2019 వరకు టెస్లాలో ఆటోపైలట్ బృందానికి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. ప్రస్తుతం మస్క్ న్యూరాలింక్ కంపెనీలో ఆపరేషన్స్ , ప్రత్యేక ప్రాజెక్టుల డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
మోదీ అమెరికా పర్యటనలో జోలిస్ తో కలిసి పాల్గొన్న మస్క్
2021లో శివోన్ , మస్క్ ఇద్దరు పిల్లలను కలన్నారు. వారిద్దరూ కవలలు. 2024లో ఆమె వారి మూడవ బిడ్డ ఆర్కాడియాను కన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఆయనతో జరిగిన సమావేశంలో శివోన్ జిలిస్ మస్క్‌తో కలిసి వచ్చారు. మస్క్ ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు ఇచ్చాడు. ప్రపంచ జనాభా సమస్య ఉందని.. తాను అందుకే జనాభాను పెంచుతున్నానని ఆయన చెబుతూ ఉంటారు.