బోయింగ్ 757-200 గ్వాటెమాలాకు వెళ్లినప్పుడు హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం కారణంగా కోస్టా రికాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అత్యవసర ల్యాండింగ్‌ కోసం జువాన్ శాంటామారియా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమాచారం పంపించింది. 


తీవ్ర ఒడిదుడుకుల మధ్య ల్యాండ్‌ అయిన DHL విమానం రన్‌వే నుంచి పక్కకు వెళ్లిపోయింది. అనంతరం రెండు భాగాలుగా ముక్కలైంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని ఫైర్‌ను ఆర్పివేశారు. 






బోయింగ్ 757-200 విమానం రన్‌ వే నుంచి పక్కనే ఉన్న మైదానంలోకి చొచ్చుకెళ్లడంతో విమానం రెక్క తెగి వేరుపడింది. ఈ ప్రమాదంలో సిబ్బందికి క్షేమంగా ఉన్నారని డీహెచ్‌ఎల్‌ ప్రకటించింది. ముందస్తు జాగ్రత్తగా అందరికీ వైద్య పరీక్షలు చేయించారు. 






ఈ సంఘటన కారణంగా రద్దీగా ఉండే విమానాశ్రయంలో గందరగోళం ఏర్పడింది. దాదాపు 8,500 మంది ప్రయాణికులు, 57 వాణిజ్య,కార్గో విమానాలు ప్రభావితమయ్యాయి. రన్‌వేపై శిథిలాల కారణంగా గంటలపాటు మూసివేయవలసి వచ్చింది.