Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హత్యకు కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. లాస్‌ఏంజిల్స్‌ సమీపంలోని రంచోపాలోస్‌ వెర్డెస్‌ వద్ద ఉన్న ట్రంప్‌ నేషనల్‌ గోల్ఫ్‌ క్లబ్‌ వెలుపల ఆయుధాలతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక వ్యక్తిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ట్రంప్ హాజరు కావాల్సిన కార్యక్రమం జరిగే రెండు రోజుల ముందే ఈ ఘటన జరగం భద్రతా సంస్థలను ఉలిక్కిపడేలా చేస్తోంది. 

Continues below advertisement

కాలిఫోర్నియాలోని గోల్ఫ్‌ కోర్స్‌లో రిపబ్లిక్‌ నేషనల్‌ కమిటీ ఒక కార్యక్రమం నిర్వహించింది. దీనికి ట్రంప్ ప్రధాన అతిథిగా రావాల్సి ఉంది. అయితే ట్రంప్‌ రాకకు 48 గంటల ముందే ఆదివారం నాడు ఒక వ్యక్తి గోల్ఫ్‌ క్లబ్‌ పరిసరాల్లోని భద్రతా ఏర్పాట్లు, సీసీ టీవీలు ఉండే ప్రాంతాలను, సిబ్బంది కదలికలను తన మొబైల్‌ ఫోన్‌‌ ద్వారా ఫొటోలు వీడియోలు తీస్తున్న రికార్డ్ చేయడాన్ని భద్రతా సిబ్బంది గమనించారు. 

వెంటనే అప్రమత్తమైన లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరిఫ్‌ పోలీసుల ఆ  వ్యక్తిని అదుపులోకి  తీసుకొని చెక్ చేశారు. ఇందులో వారికి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ప్యాంటు జేబులో 16 రౌండ్ల తూటాలతో సిద్దంగా ఉన్న ఒక మేగ్‌జైన్ లభించింది. గోల్ఫ్‌ క్లబ్ పార్కింగ్‌లో ఉన్న అతని కారును సోదా చేయగా అందులో ఒక లోడెడ్‌ పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Continues below advertisement

నిందితుడు ఎవరు?

అరెస్టు అయిన నిందితుడిని కాలిఫోర్నియాలోని డౌనీ నగరానికి చెందిన జీనైన్‌ జాన్ టేటే గా పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడిపై ఇప్పటికే ఎల్‌ సెగుండో పోలీస్ స్టేషన్‌లో ఒక దోపిడీ కేసు విచారణలో ఉన్నట్టు తేలింది. ఇంతలో ఆయుధాలతో తిరుగుతూ ఆ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను తన ఫోన్‌లో రికార్డు చేయడం వెనుక కుట్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. 

నిందితుడి ఇంట్లో భారీగా ఆయుధాలు స్వాధీనం 

నిందితుడి వద్ద లోడెడ్‌ గన్‌ దొరకడంతో ఫెడరల్ ఏజెంట్లు సోమవారం నాడు డౌనీలోని అతడి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో లభించిన సామాగ్రిని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. అక్రమంగా మార్పులు చేసి నాటో కేటగిరీకి చెందిన 45క్యాలిర్‌ పిస్టల్‌ ఒక ఏఆర్ టైప్ షార్ట్‌ బ్యారెల్‌ రైఫిల్‌ లభించాయి. భారీ సంఖ్యలో బుల్లెట్ ఫ్రూఫ్‌ జాకెట్లు, పెద్ద మొత్తంలో తూటాలు, భారీ కెపాసిటీ కలిగిన మేగజైన్‌లను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో దొరికిన కొన్ని నోట్‌బుక్స్‌లో కన్సర్నింగ్ స్టేట్‌మెంట్స్‌ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇవి నేరుగా దాడులకు లేదా హత్యాయత్నాలకు సంబంధించిన రాతలు అయి ఉండొచ్చని సమాచారం. 

కోర్టు విచారణ

నిందితుడు జీనైన్‌ జాన్ టేల్‌పై సెకండ్‌ డిగ్రీ రోబర్టీ వాహనంలో అక్రమ ఆయుధాల రవాణా, నిషేధిత షార్ట్ బారెల్‌ రైఫిల్‌ కలిగి ఉండటం వంటి తీవ్రమైన కేసులు నమోదు చేశారు. న్యాయస్థానం అతడికి 2.1 కోట్లు భారీ బెయిల్ మొత్తాన్ని విధించింది. అయితే కోర్టులో హాజరైన నిందితుడు తనపై ఉన్న ఆరోపణలను తోసిపుచ్చాడు.

ట్రంప్‌పై గత దాడులు చరిత్ర 

డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు జరగడం ఇది మొదటిసారి కాదు. గడిచిన ఏడాది కాలంలోనే ఆయనపై చాలా సార్లు హత్యాయత్నం జరిగింది. 2024 జులైలో పెన్సిల్వేనియాలోని బట్లర్‌ ర్యాలీ థామస్‌ మాథ్యూ క్రుక్స్‌ జరిపిన కాల్పుల్లో ట్రంప్‌ కుడి చెవికి గాయం కాగా, ఒక పౌరుడు చనిపోయాడు.  అదే ఏడాది సెప్టెంబర్‌లో ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌ గోల్ఫ్‌ క్లబ్‌ వద్ద రయాన్‌ వెస్లీ రౌత్‌ అనే వ్యక్తి స్కోప్‌ రైఫిల్‌తో పొదల్లో పొంచి ఉండగా సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు పట్టుకున్నారు.