Trending Video: ప్రపంచంలో ఏ వస్తువుకైనా డూప్లికేట్ తయారు చేయాలంటే చైనా తర్వాతే. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే చేసింది. అదే  విషయం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చేపలను కూడా డూప్లికేట్ చేసింది. కృత్రిమంగా తయారు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ప్రజల కూడా వీటిని విపరీతంగా ఇష్టపడి తింటున్నారు. సముద్రాల్లో వేట చేయాల్సిన అవసరం లేదు. వలలతో కుస్తీ పట్టాల్సిన పని లేదు. చేపలు పట్టే వారు లేనేలేరు. మొక్కజొన్న ఉంటే చాలు నచ్చినన్ని చేపలు, ఇష్టం వచ్చినట్టు ఉత్పత్తి చేసుకోవచ్చు. 

చైనా మొక్కజొన్న పిండితో చేపలు తయారు  

ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు, చైనా ఏదైనా తయారు చేయగలదనే సామర్థ్యానికి చక్కని ఉదాహరణ. మొబైల్ నుంచి చేప వరకు దేన్నైనా డూప్లికేట్ చేసే సత్తా డ్రాగన్ దేశానికి ఉంది.  శాకాహారుల కోసం ప్రత్యేకంగా అన్నట్టు వీటిని చైనా తయారు చేసింది. బాస్మతి రైస్‌ దానిపై మంచి కలర్‌ఫుల్‌గా ఉండే గ్రేవీతో చేప వేసుకొని తినేయొచ్చు. దాన్ని అలా నోటిలో పెట్టుకుంటే చేప లోపలి నుంచి మొక్కజొన్న పిండి రుచి తగులుతుంది. మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో చైనాలోని జనం ఇలాంటి వింతైన ఎక్స్‌పీరియన్స్‌ను అనుభవిస్తున్నారు. 

చైనాలో ఒక వింత సంఘటన ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. ఒక వైరల్ వీడియోలో కేవలం మొక్కజొన్న పిండి, ఒక ప్రత్యేక ద్రవ మిశ్రమాన్ని వేడిచేసి చల్లార్చడం ద్వారా అసలైన చేపల మాదిరిగా తయారు చేస్తున్నారు.  అయితే కొంతమంది దీన్ని చేప ఆకారంలో ఉన్న నూడుల్స్ అని పిలుస్తున్నారు. 

వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

మరికొందరు నకిలీ చేప అని పిలుస్తున్నారు

ఈ నకిలీ చేపలకు కావాల్సిన పదార్థాలను ఫ్యాక్టరీ తయారు చేస్తారు. మొదట తెల్లటి నురుగుతో కూడిన ద్రావణాన్ని తయారు చేస్తారు, దీనిలో మొక్కజొన్న పిండి కలిపి వేడి చేస్తారు. తరువాత దీన్ని చల్లార్చి, దట్టమైన జెల్లీలా చేస్తారు. తదుపరి దశలో చేప ఆకారంలో పోస్తారు. అంటే ఈ మిశ్రమాన్ని చేప ఆకారపు పాత్రల్లో పోస్తారు. కాసేపు ఆగిన తర్వాత చల్లటి నీటిలో పెడతారు. అంతే కొన్ని నిమిషాల్లో నకిలీ చేప సిద్ధమవుతుంది. బయట నుంచి చూస్తే నిజమైన చేపలానే కనిపిస్తుంది. ఎక్కడ కూడా మీకు అనుమానం రాదు. ఇప్పుడు దీన్ని రెస్టారెంట్లలో బాగా వండుతున్నారు. వడ్డిస్తున్నారు. దీని వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

చైనాపై సెటైర్లు వేస్తున్న యూజర్లు  

వీడియోను bihari_laykaa అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. దీన్ని ఇప్పటికే లక్షల మంది చూశారు. భారీ సంఖ్యలో ఈ వీడియోను లైక్ చేశారు. సోషల్ మీడియా యూజర్లు వీడియోపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇది మొక్కజొన్న పిండితో తయారు చేసింది. అని ఓ యూజర్ రాశారు. ఇలాంటి వారంతా ఎక్కడి నుంచి వస్తారా బాబు అని మరో యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంకొక వ్యక్తి  ఇవి చేప ఆకారంలో ఉన్న నూడుల్స్ అని కామెంట్ పెట్టారు.