China On India-Pakistan Tension: భారతదేశం పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య, చైనా తన నిజమైన రంగులు బయటపెట్టింది. పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడుతూ, దానికి అండగా నిలుస్తామని తెలిపింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి శనివారం (మే 10, 2005) పాకిస్తాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత జాతీయ స్వాతంత్ర్యాన్ని" కాపాడుకోవడంలో చైనా అండగా నిలుస్తుందని అన్నారు.

విదేశాంగ కార్యాలయ ప్రకటన ప్రకారం, పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో టెలిఫోన్ సంభాషణ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి ఇలా హాీ ఇచ్చారు. సవాల్‌తో కూడిన పరిస్థితుల్లో పాకిస్తాన్ సంయమనం, బాధ్యతాయుతంగా వ్యవరహించిందని వాంగ్ యి ప్రశంసించారు.

చైనా ఏమి చెప్పింది?

"పాకిస్తాన్ వ్యూహాత్మక సహకార భాగస్వామి, దృఢమైన స్నేహితుడు, దాని సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడంలో చైనా పాకిస్తాన్‌కు అండగా నిలబడుతుందని పునరుద్ఘాటించారు" అని విదేశాంగ కార్యాలయం తెలిపింది. అంతేకాకుండా, పాకిస్తాన్, భారతదేశం మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన యుఎఇ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్‌తో కూడా దార్ మాట్లాడారు.

డోనాల్డ్ ట్రంప్‌ను ప్రసంసించిన షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ శనివారం అమెరికా నాయకత్వానికి శాంతిని నెలకొల్పినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి ఇది కొత్త ఆరంభం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్, భారతదేశం మధ్య కాల్పుల విరమణ గురించి సోషల్ మీడియాలో ప్రధానమంత్రి ఈ వ్యాఖ్య చేశారు.

'X'లో ఒక పోస్ట్‌లో ఆయన ఇలా అన్నారు, "అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వం, ఈ ప్రాంతంలో శాంతి కోసం చురుకైన పాత్ర పోషించినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పరిష్కారాన్ని సులభతరం చేసినందుకు అమెరికాను పాకిస్తాన్ అభినందిస్తుంది, దీనిని ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం మేము అంగీకరించాము." దక్షిణాసియాలో శాంతికి వారి విలువైన కృషికి అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు షాబాజ్ కూడా కృతజ్ఞతలు తెలిపారు.

"ఈ ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టిన, శాంతి, శ్రేయస్సు,  స్థిరత్వాన్ని అడ్డుకున్న సమస్యలు పరిష్కరించడానికి ఇది ఒక కొత్త ప్రారంభం అని పాకిస్తాన్ విశ్వసిస్తుంది" అని ఆయన అన్నారు. అంతకుముందు, షాబాజ్ అన్నయ్య,  మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ "శాంతిని ప్రేమించే" దేశం అని, కానీ అది "తనను తాను ఎలా రక్షించుకోవాలో కూడా తెలుసు" అని అన్నారు.