Pakistan violates ceasefire agreement:  భారత్ కు ఫోన్ చేసి..కాల్పుల విరమణ పాటిద్దామని బతిమాలుకున్న పాకిస్తాన్.. మళ్లీ మొదటగా తానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని  ఇరు దేశాలు ప్రకటించాయి.కానీ డ్రోన్ దాడులు జరిగాయి. దీంతో జమ్మూలో బ్లాకౌట్ ప్రకటించారు. చీకటి పడగానే.. కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని ఇక్కడ సీజ్ ఫైర్ అమలు కావడం లేదని సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు.  

 పాకిస్తాన్ ప్రభుత్వం మాట  ఆర్మీ వినడం లేదా అన్న అభిప్రాయం వినిపిస్తోంది.  ఒప్పందానికి వచ్చిన తర్వాత ఎందుకు కాల్పులు కొనసాగిస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. పాకిస్తాన్ అధికార కేంద్రం ఇస్లామాబాద్  లో ఉందా.. రావుల్పిండిలో ఉందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

 సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం జరుపుతున్న కాల్పుల్లో మరో పోలీసు అధికారి మరణించారు. బీఎస్ఎస్ సబ్ ఇన్స్ పెక్టర్ ఇంతియాజ్ దేశం కోసం ప్రాణాలర్పించారు.            

 రెండు నగరాల్లో బ్లాకౌట్ చేశారు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ యాక్టివ్ గానే ఉంచింది. దీంతో డ్రోన్లను ఎక్కడిక్కడ కూల్చేస్తున్నారు. కానీ మోర్టార్లతో జరుపుతున్న కాల్పులు మాత్రం ఆపడం లేదు.