India Pakistan ceasefire: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలతో మూడో ప్రపంచయుద్ధం వస్తుందని వచ్చిన అంచనాలు తలకిందులు అయ్యాయి. రెండు దేశాలు చర్చలకు అంగీకరించి.. కాల్పుల విరమణ ప్రకటించాయి. ఇందులో అమెరికా హస్తం , ప్రమేయం ఉన్నాయా లేవా అన్న సంగతి పక్కన పెడితే పాకిస్తాన్ చాలా త్వరగా తమకు జరిగిన, జరగబోయే నష్టాన్ని గుర్తించి దారిలోకి వచ్చేసింది. 

మొదట కాల్పుల విరమణ ప్రతిపాదన చేసిన  పాకిస్తాన్

కాల్పుల విరమణ ప్రతిపాదన చేసింది పాకిస్తానే. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి మిస్త్రి ప్రకటించారు. పాకిస్తాన్ సైన్యం నుంచి తమకు ఫోన్ వచ్చిందన్నారు. పాకిస్తాన్ కు నిజంగా  కక్కలేని  మింగలేని పరిస్థితి ఏర్పడింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఏర్పడిన పరిస్థితుల్ని పాకిస్తాన్ సరిగ్గా డీల్ చేయలేకపోయింది. ఆ ఉగ్రదాడి తమ  పని కాదని గట్టిగా చెప్పలేకపోయింది. కనీసం ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటామని చెప్పలేకపోయారు. అలా చెబితే ఉగ్రవాదులకు కోపం వస్తుంది.  అందుకే సమర్థించుకోక తప్పని పరిస్థితిలో పడిపోయింది.భారత్ సరిహద్దులు దాటి వచ్చిన చేసిన దాడులకు ఏదో ఓ సమాధానం ఇవ్వకపోతే ప్రజల్లో పరువు పోతుంది. అందుకే ఏది జరిగితే అది జరిగిందని దాడులు ప్రారంభించారు. కానీ  రెండు, మూడు రోజులకే తీవ్రమైన సైనిక, ఆర్థిక నష్టాన్ని చూసింది. ఇంకా కొనసాగిస్తే.. దివాలా తీయడం ఖాయమని అర్థమైపోయింది. అందుకే కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చేశారు. 

భారత్ అంగీకరించడానికి కారణాలేమిటి ?

కాల్పుల విరమణకు అంగీకరించడంలోభారత్ కూడా ప్లాన్ తో నే వ్యవహరించింది.  పెహల్గాం లాంటి ఉగ్రవాద ఘటనలు చేపడితే పరిస్థితి ఎంత తీవ్రం గా ఉంటుందో చేతల్లో చూపించింది. వంద మందికిపైగా ఉగ్రవాదుల్ని చంపేసింది. తాము ఉగ్రవాద శిబిరాలపైనే చేశామని పదే పదే చెప్పింది. కానీ పాక్.. డ్రోన్ దాడులకు దిగడంతో   పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను నాశనం చేసింది. ఆర్థికంగా కట్టడి చేసింది. ఈ దెబ్బతో పాకిస్తాన్ పూర్తిగా కుదేలు అయింది. అయితే అదే సమయంలో భారత్‌కూ కొంత నష్టం జరిగింది. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగే ప్రయత్నంలో ఉన్న భారత్ .. ఇలాంటి అవాంఛనీయమైన పరిస్థితుల్ని ఎక్కువ రోజులు కొనసాగించనీయకూడదు. 

ఇక ఉగ్రదాడులు జరిగితే యుద్ధ చర్యలే! 

భారత్ ఈ కాల్పుల విరమణకు అంగీకరించే ముందు విధాన పరంగాఓ కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్ ఇకపై ఉగ్రవాద దాడులు జరిగితే.. అవి యుద్ధ దాడులుగానే  భావించి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. పాకిస్తాన్ ట్రైన్ అయిన జర్నలిస్టులు కశ్మీర్ కో.. మరో చోటకో వచ్చి దాడులు చేస్తే  పాకిస్తాన్ చేసిన యుద్ధంగానే భావిస్తామని కేంద్రం తేల్చింది. దీనికి పాకిస్తాన్ అంగీకరించింది. అందుకే  కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆర్మీ జనరల్స్ స్థాయిలో చర్చలు జరుగుతాయి. గతంలో చర్చలు ఆగిపోయాయి. 

పాక్ కు పెరిగిన అంతర్గత సమస్యలు 

పాకిస్తాన్ కు ఇప్పుడు ఉగ్రవాదుల్నికాపాడటం కాదు.. తమ దేశం చీలకుండా చూసుకోవడం కీలకం. బలూచిస్తాన్ లో .. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పట్టు సాధించింది. అక్కడ వందల మంది సైనికులు చనిపోతున్నారు. ఈ దశలో  పాకిస్తాన్ కు మరో ఆప్షన్ లేకుండా పోయింది. తెగేదాకా లాక్కోకుండా... కాళ్ల బేరానికి వచ్చేసింది. భారత్ ఎలాంటి ఎఫెక్ట్ కోసం చూసిందో అది రావడంతో అంగీకరించిందని అనుకోవచ్చు.