Viral  News: కోవిడ్ తరువాత వినియోగదారులను ఆకర్షించడానికి రెస్టారెంట్లు కొత్త కొత్త మార్గాలను అణ్వేసిస్తున్నాయి. రెస్టారెంట్ల పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేలా ప్రత్యేకంగా థీమ్స్ పేరుతో ఏర్పాట్లు చేస్తున్నాయి. కొన్ని చోట్ల విమానంలో రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నారు, మరికొన్ని చోట్ల షిప్ రెస్టారెంట్, రైల్ రెస్టారెంట్ అంటూ ఏర్పాటవుతున్నాయి. ఇవన్నీ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. కొన్ని చోట్ల రోబో దైన్ ఇన్‌లు, కొన్ని చోట్ల డోన్లు, మరి కొన్ని చోట్ల చిన్న పాటి రైళ్లతో ఆహారాన్ని సర్వ్ చేస్తుంటారు.


తాజాగా థాయ్‌లాండ్‌లో ఓ కేఫ్ నిర్వాహకులు సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. కేఫ్‌లో నీటిని నింపి అందులో చేపలు వదిలారు. పాదాలు నీటిలో ఉండగా  చుట్టూ చేపలు వస్తుంటాయి. వినడానికి ఆశ్చర్యంగా, వింతగా ఉన్నా.. నమ్మాల్సిందే. దీని గురించి ఒక రెడిట్ వినియోగదారుడు షేర్ చేశాడు. అతడు పోస్ట్ చేసిన చిన్న వీడియో 16 వేలకు పైగా అప్‌వోట్లు, వెయ్యికి పైగా కాంమెట్లు వచ్చాయి. 


18 సెకన్ల ఉన్న ఆ వీడియోలో ఒక చిన్న గది, దాని లోపల అమర్చబడిన కుర్చీలు, టేబుల్‌లను చూడవచ్చు. గోడపై ఉన్న బ్యానర్, 'స్వీట్ ఫిష్స్ కేఫ్' అని రాసి ఉంది. ఫ్లోరింగ్ చెక్కగా కనిపిస్తుంది. చీలమండ లోతు నీటితో నిండి ఉంటుంది. అతిథులను స్వాగతించడానికి నీటి లోపల వివిధ మధ్య తరహా రంగు రంగుల చేపలు కూడా ఉన్నాయి. ఈ విచిత్రమైన వీడియోకు రెడిట్ వినియోగదారుల నుంచి చాలా కామెంట్లు వచ్చాయి. కేఫ్‌లోని ఫిష్ ట్యాంక్ గురించి చాలా మంది ఆశ్చర్యపోయారు. మరి కొందరు అసహ్యించుకున్నారు. పరిశుభ్రత సమస్యలతో అక్కడికి వెళ్లడంపై చాలా మంది అసహ్యం వ్యక్తం చేశారు. 


కొందరు మాత్రం తమ సలహాలను ఇచ్చారు. గ్లాస్ ఫ్లోర్‌ ఏర్పాటు చేసి దాని కింద అక్వేరియం ఏర్పాటు చేసి ఉంటే బాగుందేదని కొందరు తమ అభిప్రాయాలను వెల్లడించారు. కొన్నిసార్లు కొత్తదనం చాలా దూరం వెళుతుందని ఒక వినియోగదారు అభిప్రాయపడ్డారు.  


చైనాలో వింత రెస్టారెంట్
చైనాలోని బీజింగ్ నగరంలో ఒక రెస్టారెంట్ కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా వికృత చర్యలకు పాల్పడింది. మంచి దేహదారుడ్యం కలిగి, ఎత్తుగా ఉండే మగవారిని వెయిటర్లుగా నియమించుకుంది. వారితో డ్యాన్సులు చేయిస్తూ మహిళా కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. దీంతో మహిళా కస్టమర్ల తాకిడి విపరీతంగా పెరిగింది. ఇంతటితో ఆగకుండా సియామీ థీమ్ ను ప్రచారం చేసింది. మగవారు షర్ట్ లేకుండా, అర్థనగ్నంగా తిరుగుతూ.. తమ దేహ సౌందర్యాన్ని చూపిస్తూ స్త్రీలను ఆకర్షించే వారు. ఆ తరువాత రెస్టారెంట్ యాజమాన్యం కస్టమర్లని మరింత రెచ్చగొట్టేలా రాడ్ లికింగ్ అనే పోల్ డ్యాన్స్ నృత్యాన్ని ఏర్పాటు చేసింది.


వెయిటర్లు డ్యాన్సులు చేస్తూ తమ నోటితో కస్టమర్లకు తినిపించే వారు. ఇందులో షోల్డర్ మజాస్ కూడా అందుబాటులో తీసుకొచ్చి ఆసక్తి తోపాటూ అవసరమైన వారికి చేసేవారు. విషయం కాస్తా చివరకు అధికారుల దృష్టికి చేరింది. దీంతో ఆ రెస్టారెంట్ పై తనిఖీలు నిర్వహించారు. సామాజిక విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు, చట్టాలకు గౌరవం ఇవ్వకుండా ఇలాంటి చర్యలకు పాల్పడిన రెస్టారెంట్ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకూ ఎంత సంపాదించారో లెక్కలు బయటకు తీసి దానికి పది రెట్లు జరిమానా విధించారు. చివరకు రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేశారు.