Bill gates: ఏఐ చాట్‌ బాట్‌లు త్వరలోనే పిల్లలకు చదవడం నేర్పిస్తుందని, రాయడంలో కూడా శిక్షణ ఇస్తుందన్నారు బిలియనీర్ మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. ఇదో ట్యూటర్‌లా పని చేస్తుందని చెప్పుకొచ్చారు.  


బిలియనీర్ మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మంగళవారం శాన్ డియాగోలో జరిగిన ASU+GSV సమ్మిట్‌లో కీలక ప్రసంగం చేశారు. 18 నెలల కాలంలో AI చాట్‌బాట్‌ ద్వారా పిల్లలు చదవడం, రాయడం వంటి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చని అన్నారు.
"చదవడం, రాయడం వంటి సామర్థ్యాన్ని AIలు అందుకుంటాయి, మనిషి కంటే మంచి ట్యూటర్‌గా ఉండగలవు."
AI చాట్‌బాట్‌లతో చాలా ఆకట్టుకున్నారు. సాంకేతికత మునుపెన్నడూ లేని విధంగా విద్యార్థులకు సహాయకారిగా ఉండబోతోంది. విద్యార్థులు సొంతంగా చదవడం, రాయడం నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి సహాయపడుతుందని గేట్స్ చెప్పారు. "నేటి చాట్‌బాట్‌లు చదవడం, రాయడంలో అద్భుతమైన పటిమను కలిగి ఉన్నాయి."అని అన్నారు. 


"మొదట, ఇది చదవడానికి రీడింగ్ రీసెర్చ్ అసిస్టెంట్‌గా ఉంటూనే రాయడంపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంలో ఎలా సహాయపడుతుందో చూసి మనమంతా చాలా ఆశ్చర్యపోతాము" అని గేట్స్ చెప్పారు.


కీనోట్ సందర్భంగా మిస్టర్ గేట్స్ మాట్లాడుతూ, కంప్యూటర్‌కు రాత నైపుణ్యాలను బోధించడం చాలా కష్టమైన పని అని అన్నారు. వాటిని కోడ్‌ల రూపంలో ఇచ్చేందుకు చాలా ఎక్స్‌ర్‌సైజ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. కానీ ఇప్పుడు AI చాట్‌బాట్‌కు డైనమిక్‌గా ఉండే మనుషుల భాషా మార్పులను గుర్తించి, పునఃసృష్టి చేయగల సామర్థ్యం ఉందని ఆయన పేర్కొన్నారు.
"మీరు రాబోయే 18 నెలల సమయం తీసుకుంటే, AIలు ఉపాధ్యాయులకు సహాయకుడిగా వస్తాయి. రచనపై అభిప్రాయాన్ని అందిస్తాయి" అని గేట్స్ చెప్పారు. "ఆపై గణితంలో మనం ఏం చేయగలుగుతున్నాం అన్నీ చేసే సామర్థ్యం పెంచుకోనున్నాయి."


AI చాట్‌బాట్‌లు మరింతగా అందుబాటులో ఉంటాయని గేట్స్ చెప్పారు. "ఇది లెవలర్‌గా ఉండాలి," అని ఆయన చెప్పారు. "ఎందుకంటే చాలా మంది విద్యార్థులకు ట్యూటర్‌ని పెట్టుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ప్రత్యేకించి ఏఐని ట్యూటర్‌గా పెట్టుకోవచ్చు. "


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial