Bangladesh Election Results : బంగ్లాదేశ్ (Bangladesh) ప్రధాన మంత్రిగా షేక్ హసీనా (Sheikh Hasina) రికార్డు నెలకొల్పారు. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో షేక్ హసీనా ఐదోసారి విజయం సాధించారు. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ ఫుల్ మెజారిటీ సాధించింది. 300 సీట్లలో 299 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అవామీ లీగ్ పార్టీ 200పైగా సీట్లలో విజయ బావుటా ఎగురవేసింది. షేక్ హసీనా వరుసగా నాలుగోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. గోపాల్‌గంజ్-3 నుంచి పోటీ చేసిన ప్రధాని హసీనా 2,49,965 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థికి కేవలం 469 ఓట్లు మాత్రమే వచ్చాయి. గోపాల్‌గంజ్-3 నుంచి హసీనా 8వ సారి గెలుపొందారు. 1986 నుంచి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే వరకు ఓటమి అన్నదే ఎరగలేదు. ప్రధాన ప్రతిపక్షం బీఎన్‌పీ, దాని మిత్రపక్షాలు ఎన్నికలను బహిష్కరించాయి.