India Vs Maldives Row: 


స్పందించిన మాల్దీవ్స్..


మాల్దీవ్స్ మంత్రి ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సెలెబ్రిటీలు వరుస పెట్టి పోస్ట్‌లు పెట్టారు. "ఇంత ద్వేషాన్ని మనం ఎందుకు భరించాలి" అంటూ గట్టిగానే ప్రశ్నించారు. పైగా మాల్దీవ్స్‌ని బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్ అవుతోంది. మాల్దీవ్స్‌పై ఉన్నట్టుండి వ్యతిరేకత రావడం వల్ల ప్రభుత్వం స్పందించింది. ప్రధాని మోదీ పేరు ప్రస్తావించకుండానే ఓ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ఈ వివాదం తమ దృష్టికి వచ్చిందని, ఆ వ్యాఖ్యలు ఆ మంత్రి వ్యక్తిగతమే అని తేల్చి చెప్పింది. ఈ వ్యాఖ్యలకి ప్రభుత్వ అభిప్రాయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆ మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనకాడదని వివరించింది. ఈ వివాదంపై  Indian High Commissioner కూడా తీవ్రంగా పరిగణించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 


"సోషల్ మీడియాలో జరుగుతున్న వాదనలు మా దృష్టికి వచ్చాయి. ఓ మంత్రి ఇలా విదేశీ నేతపై పోస్ట్ పెట్టడం సరికాదు. ఈ వ్యాఖ్యలేవైనా అవి వ్యక్తిగతం మాత్రమే. ఆ కామెంట్స్‌కి ప్రభుత్వ అభిప్రాయాలకు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనకాడదు. సంబంధిత అధికారులు తప్పకుండా చర్యలు తీసుకుంటారు. భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ దాన్ని కాస్త బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలి. ఇలా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఉపయోగించకూడదు"


- మాల్దీవ్స్ ప్రభుత్వం