Bangkok street Vidos: బ్యాంకాక్ అంటే సుందరమైన వీధులు. చారిత్రక కట్టడాలు, అంతకు మించి ఎత్తయిన భవనాల్లో విలాసవంతమైన హోటళ్లు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులతో సందడిగా ఉండిది. అయితే ఆ కళ అంతటిని భూకంపం తుడిచి పెట్టేసింది. ఇప్పుడు బ్యాంకాక్ వీధులు కళా విహీనంగా ఉన్నాయని చెప్పడం కన్నా శిథిలమైపోయాయని చెప్పవచ్చు. పలువురు బ్యాంకాక్ లో ఉన్న వాళ్లు వీడియోలు తీసి సోషల్మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు.
బ్యాంకాక్ హోటళ్లలో అత్యంత ఎత్తుగా పైన ఉండే స్విమ్మింగ్ పూల్లో సేదదీరడం చాలా మందికి సరదా. జంటలు ఆ స్విమ్మింగ్ పూల్ లో సేదదీరుతున్న సమయంలో వచ్చిన ఎర్త్ క్వాక్ కారణంగా పరుగులు పెట్టేలా చేసింది. ఓ హోటల్ పై అంతస్తులో స్విమ్మింగ్ ఫూల్ లో ఉన్న ఓ జంట పడినఆందోళన వీడియో వైరల్ గా మారింది.
నెటిజన్లు గతంలో తాము దిగిన ఫోటోల్లో ఉన్నప్రముఖ నిర్మాణాలను చూపిం.. ఇప్పుడు అవి ఉన్న పరిస్థితి చూసి ఆవేదన చెందుతున్నారు. జ్ఞాపకాలను పంచుకుంటున్నారు.
బ్యాంకాక్‌లో కూలకుండా ఉన్న ఇళ్లు కూడా కూలిపోయేలా మారిపోయాయి. పెద్ద ఎత్తున పగుళ్లు ఇచ్చాయి.
బ్యాంకాక్ జన జీవనం పూర్తి స్థాయిలో అస్తవ్యస్థమయిది. ఇప్పుడల్లా కోలుకోవడం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది.
బ్యాంకాక్ సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. వివిధ రకాల రెస్క్యూ సామాగ్రితోపాటు అవసరమైన వస్తువులను పంపుతున్నాయి. బ్యాంకాక్ ను ఇప్పుడల్లా సాధారణ స్థితికి తీసుకురావడం కష్టమని నిపుణులు అంటున్నారు.