Age limit For Social Media Usage: ప్రస్తుతం బ్యాంకు అకౌంట్ లేనివాళ్లు ఉంటారేమో కానీ... సోషల్ మీడియా అకౌంట్ లేని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ సోషల్ మీడియా 360 డైమెన్షన్‌లో పదునుకు కలిగి ఉంటుంది. అందుకే ఇలాంటి ఆయుధం చిన్నారులకు దూరంగా ఉంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. సోషల్ మీడియాను చిన్నారు వాడుతున్న విధానంపై ఎప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. అందుకే ఆస్ట్రేలియా ఓ అడుగు ముందుకేసి సోషల్ మీడియా వాడకానికి కూడా ఓ ఏజ్ లిమిట్ పెట్టే ఆలోచన చేస్తోంది. 


ఆస్ట్రేలియాలో పిల్లలు అతిగా సోషల్‌ మీడియా వినియోగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆ దేశ ప్రభుత్వం వినియోగానికి కనీస వయస్సు నిర్ధారించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ దిశగా చట్టాన్ని తీసుకు రావాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రైమ్‌ మినిష్టర్‌ ఆంథోనీ ఆల్బనీస్‌ ప్రకటన చేశారు. ఈ చట్టం ద్వారా  సోషల్ మీడియా భూతం నుంచి చిన్నారులను కాపాడడంలో తల్లిదండ్రులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం  మద్దతగా నిలుస్తుందని ఆల్బసీన్‌ ట్విట్ చేశారు. పిల్లలకు ఏ వయస్సు వరకు సోషల్ మీడియాతో పాటు ఇతర డిజిటల్ మాధ్యమాలకు దూరంగా ఉంచాలని పేరెంట్స్‌ భావిస్తున్నారో తెలపాలని ఆంథోనీ కోరారు. పేరెంట్స్‌ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని పార్లమెంటు చట్టం చేస్తుందని ఆయన చెప్పారు.


పిల్లల మెంటల్‌ హెల్త్‌పై తల్లిదండ్రుల తీవ్ర ఆందోళన:


2023 ఆగస్టు 21న మిషిగన్ హెల్త్‌ యూనివర్శిటీ పరిధిలోని CS మాట్ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వే ద్వారా ఎక్కువ మంది పేరెంట్స్‌ తమ పిల్లల మెంటల్‌ హెల్త్‌పై ఆందోళన వ్యక్తం చేసినట్లు తేలింది. సర్వేలో పాల్గొన్న ప్రతి  10 మందిలో ఐదుగురు తమ పిల్లల  మానసిక స్థితి పట్ల పేరెంట్స్‌ భయాందోళనలో ఉన్నారని ఆ సర్వే పేర్కొంది. చిన్నారులతో పాటు టీనేజ్‌ వాళ్లలో సోషల్‌ మీడియా యూసేజ్‌తో పాటు వారి మెంటల్‌ హెల్త్‌లో ఇబ్బందులు కూడా పెరిగినట్లు తెలిపింది.


పదేళ్ల క్రితంతో పోల్చితే ఈ సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో ఒబేసిటీ సమస్యలు కూడా అధికంగా ఉన్నట్లు సర్వే వివరించింది. ఈ సోషల్‌ మీడియా వినియోగం సహా స్క్రీన్ వీవింగ్‌ టైం ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు టైంకి ఫుడ్‌ తీసుకోక పోవడంతో వాళ్లలో శారీరకపరమైన హెల్త్‌ సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయని.. ఇది కూడా తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నట్లు CS మాట్స్ హాస్టిటల్‌ డైరెక్టర్ సుసాన్ హూల్‌ఫోర్డ్ వివరించారు.


Also Read: అద్భుతమైన ఆరోగ్య ఫీచర్లతో ఆపిల్ వాచ్ 10 సిరీస్‌ విడుదల- ఇండియాలో ధర ఎంత అంటే?


పిల్లలు సోషల్ మీడియా భూతం నుంచి బయట  పడడం సహా వాళ్లు చూసే కంటెంట్‌పై మానిటరింగ్‌ ఎలా అన్నది తల్లిదండ్రును తీవ్రంగా కలచి వేస్తున్న అంశంగా సుసాన్‌ పేర్కొన్నారు. డిజిటల్ ఫ్లాట్‌ ఫామ్స్‌ సహా సోషల్‌ మీడియా కారణంగా ఎవరు ఎవరితో టట్‌లో ఉంటున్నారో తెలియడం లేదని.. వాళ్లు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావడం లేదని ఇది ఒక మెంటల్ హెల్త్ ఇష్యూగా తయారైందని.. 60 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారన్నారు. అమెరికా సహా అన్ని దేశాల్లో ఈ సమస్య ఉందన్నారు.


Also Read: అదిరిపోయే ఫీచర్స్‌తో లాంచ్ అయిన iPhone 16 Pro- బిగ్‌ స్క్రీన్, స్పెషల్ కెమెరా ఫీచర్స్‌ ఉన్న ఈ ఫోన్ ధర ఎంతంటే?


సోషల్ మీడియా యూసేజ్‌కి కనీస వయస్సు 14 లేదా 16


ఈ సర్వే ఫలితాలు సహా ఆస్ట్రేలియా తల్లిదండ్రుల్లో ఆందోళనల నేపథ్యంలో చట్టం తీసుకురావాలని డిసైడ్ ఆయన ఆ దేశ పార్లమెంట్.. సోషల్‌ మీడియా వినియోగానికి కనీస వయస్సు ఎంతుండాలి అనే దానిపై విస్తృతంగా చర్చిస్తోంది. ఎక్కువ మంది 14 లేదా 16 ఎళ్లు అప్రోప్రియేట్‌ ఏజ్‌గా పేర్కొంటున్నారు. ఆస్ట్రేలియా చర్యను స్వాగతిస్తున్న పిల్లల వైద్యులు, మానసిక నిపుణులు.. ఇది ఎన్నికల స్టంట్‌గా కాకుండా బాల్యాన్ని కాపాడేగా ఉండాలని పేర్కొంటున్నారు.


Also Read: అద్భుతమైన ఆరోగ్య ఫీచర్లతో ఆపిల్ వాచ్ 10 సిరీస్‌ విడుదల- ఇండియాలో ధర ఎంత అంటే?