Australia Man Spent Rs 4.6 Crore Accidentally Deposited In His Bank Account:


నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోతే వరకు మనిషి జీవితంలో డబ్బు కీలకపాత్ర పోషిస్తుంటుంది. డబ్బులు లేని ఎలా సంపాదించాలి, ఖర్చులకు ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. డబ్బులు ఎక్కువగా ఉంటే వాటితో వ్యాపారం చేయాలా, ల్యాండ్ కొనాలా, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అని థింక్ చేస్తారు. అయితే అనుకోకుండా డబ్బులు దొరికాయి అనుకోండి చాలా సంతోషపడుతాం. కానీ లభించిన సొమ్ము వందో, వెయ్యో అయితే పర్లేదు కానీ ఎకంగా కోట్లు ఉట్టి పుణ్యానికి మీ బ్యాంక్ ఖాతాలో జమ అయితే ఎలా ఉంటుంది. ఇలాంటి సంఘటనే ఆస్ట్రేలియాలో జరిగింది. 24 ఏళ్ళ ఓ కుర్రాడికి ఏకంగా 4.6 కోట్ల రూపాయలు అకౌంట్ లో వచ్చి పడ్డాయి. చివరికి జైలు పాలయ్యాడు ఆ యువకుడు.


9నౌ రిపోర్ట్ ప్రకారం.. ఆస్ట్రేలియాకు చెందిన అబ్దేల్ ఘడియా అనే 24 ఏళ్ల యువకుడికి 4,20,000 స్టెర్లింగ్ పౌండ్లు (భారత కరెన్సీలో అక్షరాలా 4.6 కోట్ల రూపాయలు )  అనుకోకుండా అతడి ఖాతాలో జమయ్యాయి. ఎక్కడ నుంచి ఈ పౌండ్లు వచ్చాయి, ఎవరు పంపించారు అన్న విషయాలు పట్టించుకోలేదు. ఆ డబ్బు అంతా బంగారం, డ్రెస్సులు, ఇతరత్రా అవసరాల కోసం ఖర్చు చేసేసాడు.
డబ్బు ఎవరిదంటే.. 
అబ్దేల్ ఘడియా అకౌంట్ లో జమ అయిన ఈ భారీ మొత్తం  తార త్రోన్ అనే న్యుట్రీషనిస్ట్, ఆమె భర్త కోరే సిడ్నీలోని ఉత్తర బీచ్ లో ఓ ఇల్లు కొనుకోవ్వడానికి దాచుకున్నారు. ఆడమ్ మార్గో అనే మధ్యవర్తి ద్వారా ఇల్లు కొనుగోలు చేయడానికి డబ్బులు పంపించబోయి పొరపాటున వేరే అకౌంట్ కు బదిలీ చేశారు. ఆ క్యాష్ డిపాజిట్ అయిన అకౌంట్ అబ్దేల్ ఘడియాది. ఇలా వచ్చిన డబ్బునే ఆ యువకుడు తన ఇష్టానుసారంగా ఖర్చు చేసేశాడు. గత ఏడాది జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


ఆ యువకుడికి జైలు శిక్ష 
రూ.4.6 కోట్ల మొత్తం అబ్దేల్ బ్యాంక్ అకౌంట్లోకి జమ అయ్యాయని బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నగదును తిరిగిచ్చేయాలని యువకుడు అబ్దేల్ కు పోలీసులు సూచించారు. తాను తప్పు చేసినట్టు ఒప్పుకున్నాడు. కాని నగదు బదిలీ విషయంతో తనకు సంబంధం లేదని తెలిపాడు. ప్రస్తుతం తన వద్ద డబ్బు లేదని, ఆ మొత్తాన్ని తనకు కావాల్సిన బంగారం కొనేందుకు ఖర్చుచేశాడు. మిగతా నగదును డ్రస్సులు, ఇతర అవసరాలకు వాడుకున్నాడు. ప్రేమించిన వారికి బంగారం ఇచ్చేశానని, తన చేతిలో ఏమీ మిగల్లేదని చెప్పినట్లు డైలీ టెలిగ్రాఫ్ రిపోర్ట్ చేసింది. ఈ కేసులో నిందితుడికి 18 నెలల జైలు శిక్ష విధించారు. దీనితో పాటు 10 నెలల నాన్-పెరోల్ గడువు విధించారు. బంగారం ఎవరికి ఇచ్చాడో పోలీసులు కనుక్కోలేకపోయారు. ఏ కష్టం లేకుండా, అమాంతం అకౌంట్లో వచ్చి పడిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేసిన యువకుడు ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్నాడు.